newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనికి అడ్డంగా దొరికిపోయిన కేదార్‌ జాదవ్‌..!

16-09-202016-09-2020 14:39:55 IST
2020-09-16T09:09:55.094Z16-09-2020 2020-09-16T09:09:53.358Z - - 19-04-2021

ధోనికి అడ్డంగా దొరికిపోయిన కేదార్‌ జాదవ్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజన్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనున్నాయి. అయితే.. చెన్నై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అయినప్పటికి త్వరలోనే అన్ని సర్దుకుంటాయన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు కారణం.. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనినే. మిస్టర్‌ ఇలాంటి ఎన్నో అవరోధాలను దాటి వచ్చాడు. చెన్నై జట్టు భారం అంతా ధోని పైనే ఉంది. ఇప్పటికే ఆ జట్టుకు మూడు సార్లు టైటిల్‌ అందించాడు.

ఇదిలా ఉంటే.. సీఎస్‌కే ఆటగాళ్ల సందడి మొదలైంది. ఆ జట్టు మంగళవారం తమ జెర్సీకి సంబంధించిన వీడియోను ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. చెన్నై జెర్సీ వేసుకున్న మహేంద్రుడు ఈలవేయడంతో పాటు మురళీ విజయ్‌, షేన్‌ వాట్సన్‌, రవీంద్ర జడేజాలతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. ఇక కాలర్‌ ఎగరేస్తూ మహి చేసిన స్టెప్‌ చెన్నై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియో పాటు మరో ఫోటోను పోస్టు చేసింది

మురళీ విజయ్‌, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, ఫాప్‌ డుప్లెసిస్‌లు ఒక బెంచీపై కూర్చోని ఉండగా.. మహీ వాళ్లకి ఎదో క్లాస్‌ తీసుకుంటున్నాడు. క్లాస్ మధ్యలో ఎవరో విజిల్‌ వేశారు. దీంతో ధోని నా క్లాస్‌లో ఎవరు విజిల్‌ వేసింది అని అడగగా.. మిగతా ఆటగాళ్లంతా కేదార్‌ జాదవ్‌ వైపు వేలు చూపిస్తున్నారు ఆ ఫోటోలో. ప్రస్తుతం ఈ పిక్‌ కూడా వైరల్‌గా మారింది.

చెన్నై జట్టు కీలక ఆటగాడు సురేష్‌ రైనా వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. వైరస్‌ బారిన పడినప్పటి నుంచి లక్షణాలు అంతగా ఏం లేకున్నా.. పాజిటివ్‌గా తేలడం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రైనా స్థానంలో రుతురాజ్‌ను ఆడించాలనుకున్న చెన్నైకి ఇది నిజంగా ఎదురుదెబ్బె. మరీ రైనా స్థానంలో (మూడో నెంబర్‌లో) ఎవరు బరిలోకి దిగనున్నారో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగక తప్పదు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle