newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దుబాయ్‌ వేదికగా క్యాంప్‌..

16-07-202016-07-2020 11:58:26 IST
Updated On 16-07-2020 13:33:22 ISTUpdated On 16-07-20202020-07-16T06:28:26.582Z16-07-2020 2020-07-16T06:28:24.301Z - 2020-07-16T08:03:22.771Z - 16-07-2020

దుబాయ్‌ వేదికగా క్యాంప్‌..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత మార్చి నుంచి ఆటకి దూరంగా ఉంటున్న భారత క్రికెటర్లకి త్వరలోనే ఓ ఆరు వారాల ట్రైనింగ్ క్యాంప్‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాటు చేయబోతోంది. భారత్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. దుబాయ్‌ వేదికగా ఆ క్యాంప్‌ని నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. 

కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించడంతో భారత క్రికెటర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ తదితరులు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. కానీ.. టీమ్‌ మొత్తానికి కలిపి ఓ ట్రైనింగ్ క్యాంప్‌ని త్వరలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నాలుగు నెలల తర్వాత గత వారం ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ మొదలైంది. పూర్తి బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్నాయి. 

మిగిలిన క్రికెట్ దేశాలు కూడా ట్రైనింగ్‌ క్యాంప్‌లను ప్రారంభించి సిరీస్‌లకి సిద్ధమవుతున్నాయి. దాంతో.. బీసీసీఐ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లందరికీ త్వరలోనే ఒక క్యాంప్‌ని నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. ఆ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండటంతో వరల్డ్‌కప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఒకవేళ టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేస్తే..? ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దాంతో.. అప్పటిలోపు భారత క్రికెటర్లకి తగినంత ప్రాక్టీస్‌ లభించేలా చూడాలని బీసీసీఐ భావిస్తోంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle