newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దుబాయిలో ఐపీఎల్.. ఆటగాళ్ళేమంటారో?

23-07-202023-07-2020 09:14:12 IST
Updated On 23-07-2020 09:24:52 ISTUpdated On 23-07-20202020-07-23T03:44:12.219Z23-07-2020 2020-07-23T03:43:51.440Z - 2020-07-23T03:54:52.512Z - 23-07-2020

దుబాయిలో ఐపీఎల్.. ఆటగాళ్ళేమంటారో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడటంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌కి మర్గం సుగుమమైంది. కానీ.. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉండటంతో.. ఐపీఎల్‌ని యూఏఈ వేదికగా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కోసం ఎదురుచూస్తోంది.

యూఏఈలో టోర్నీ నిర్వహించినా.. అక్కడికి వచ్చి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేందుకు కొంత మంది క్రికెటర్లు పునాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదట పెదవి విప్పిన క్రికెటర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్  కెన్ విలీయమ్సన్. టోర్నీ ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాతే మ్యాచ్‌లు ఆడతానని ఈ న్యూజిలాండ్ కెప్టెన్ వెల్లడించాడు.

టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాపడటం సిగ్గుచేటు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో మరో మార్గం కూడా ఐసీసీకి కనిపించలేదు. ఇక ఐపీఎల్‌లో ఆడటంపై తుది నిర్ణయం తీసుకునేముందు చాలా అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి.

యూఏఈ వేదికగా బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. కానీ.. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి.. ఐపీఎల్‌ని సురక్షిత వాతావరణంలో నిర్వహిస్తున్నారని క్లారిటీ వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటా అని కేన్ విలియమ్సన్ వెల్లడించాడు.

ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 44 రోజుల ఈ విండోలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ టోర్నీ కోసం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తరహాలో బయో- సెక్యూర్ బబుల్‌ని క్రియేట్ చేయడం కష్టమని బీసీసీఐ పెద్దలు చెప్తున్నారు. ఏది ఏమైనా భారీ క్రికెట్ పండుగ ఎలా జరుగుతుందోనని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle