newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దుబాయిలోనే ఐపీఎల్ 2020... బ్రిజేశ్ పటేల్ వెల్లడి

22-07-202022-07-2020 08:57:55 IST
Updated On 22-07-2020 12:08:12 ISTUpdated On 22-07-20202020-07-22T03:27:55.003Z22-07-2020 2020-07-22T03:27:31.462Z - 2020-07-22T06:38:12.389Z - 22-07-2020

దుబాయిలోనే ఐపీఎల్ 2020... బ్రిజేశ్ పటేల్ వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ వెలుపలే ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశాడు. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉండటంతో.. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 మధ్య ఇక్కడ ఐపీఎల్‌ని నిర్వహించడం అసాధ్యమని తేలిపోయింది. 

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని నిర్ణయించినట్లు బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు. అయితే.. యూఏఈ వేదికగా టోర్నీ నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు అతను వివరించాడు.

కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ 2020 సీజన్‌ని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించాం. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోరాం. పర్మీషన్ వచ్చిన తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చించి పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ని ప్రకటిస్తాం’’ అని బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు. ఇప్పటికే వెలువడిన వార్తల ప్రకారం 44 రోజుల విండోలో 60 మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

వాస్తవానికి మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా తొలుత టోర్నీని ఏప్రిల్ 15కి వాయిదా వేసిన బీసీసీఐ.. అప్పటిలోపు పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో నిరవధికంగా వాయిదావేసింది.ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు- నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ సోమవారం వాయిదా వేయడంతో.. ఐపీఎల్‌కి మార్గం సుగుమమైంది.

కానీ.. భారత్ వేదికగానే స్టేడియంలోకి ప్రేక్షకుల్ని అనుమతించకుండా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారని అంతా ఊహించారు. అయితే.. అది కూడా సాధ్యంకాదని తేలిపోయింది. అయితే.. ఒకవేళ యూఏఈ ప్రభుత్వం అనుమతిస్తే..? ఐపీఎల్ మ్యాచ్‌లకి ప్రేక్షకుల్ని అనుమతిస్తామని బ్రిజేశ్ పటేల్ వెల్లడించాడు.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle