newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

07-12-201907-12-2019 17:40:42 IST
Updated On 07-12-2019 17:40:40 ISTUpdated On 07-12-20192019-12-07T12:10:42.275Z07-12-2019 2019-12-07T12:09:37.719Z - 2019-12-07T12:10:40.173Z - 07-12-2019

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్ కౌంటర్ చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే ఈ సంఘటనలో జనం వ్యవహరించిన తీరుని తప్పుబట్టారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల.

No photo description available.

ఈ ఎన్ కౌంటర్‌తో అత్యాచారాలు. హత్యలు ఆగుతాయా అని ఆమె ప్రశ్నించారు. ట్విటర్లో ఆమె స్పందించారు. ఎన్ కౌంటర్ అనంతరం పోలీసులను ప్రశంసించడం, పూవులు వేయడం, ఫెస్టివల్ చేసుకోవడం.. తనకు నచ్చలేదన్నారు. అలా అని తాను రేపిస్టుల పట్ల సానుభూతి చూపించడంలేదన్నారు. 

సాధారణంగా ఇలాంటి విషయాలపై సెలబ్రిటీలు అరుదుగా రియాక్ట్ అవుతూ వుంటారు. దిశ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు సరిగా స్పందించలేదని విమర్శలు వచ్చాయని, అలాంటిది నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశాక వారిని అభినందించడం, పాలాభిషేకాలు, పువ్వులు చల్లడం బాగా లేదన్నారు. ఎవరైనా చనిపోతే.. వారి శవాలను చూడకుండా తరలిస్తారని, కానీ నలుగురు నిందితుల శవాలు అందరూ చూసేలా తరలించడం సమంజసంగా లేదన్నారు గుత్తా జ్వాల.

మనదేశంలో రాజ్యాంగం ఉందని, చట్టం ద్వారా నిందితులను శిక్షించే అవకాశం ఉందన్నారు. గతంలో వరంగల్ నగరంలో యాసిడ్ దాడికి దిగిన నిందితులను ఎన్ కౌంటర్ చేశారని, ఆతరవాత అలాంటి దాడులు జరగకుండా ఆగిపోయాయా అని గుత్తా జ్వాల ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేశాక కూడా ఇలాంటి సంఘటనలు జరగడం ఏంటని ఆమె అన్నారు.

గుత్తా జ్వాల ట్వీట్లు, కామెంట్లపై చర్చ జరుగుతోంది. అందరికంటే భిన్నంగా ఆమె కామెంట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. కానీ తాను మహిళా పక్షపాతినని, తాను రేపిస్టులకు సానుభూతి కోసం మాట్లాడడం లేదని ఓ ఛానెల్ తో మాట్లాడుతూ చెప్పారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle