newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దాని రూపాన్ని ధోనీలో చూశా.. కోహ్లీ ఉద్వేగం

16-08-202016-08-2020 11:08:40 IST
Updated On 16-08-2020 11:13:55 ISTUpdated On 16-08-20202020-08-16T05:38:40.255Z16-08-2020 2020-08-16T05:38:38.109Z - 2020-08-16T05:43:55.230Z - 16-08-2020

దాని రూపాన్ని ధోనీలో చూశా.. కోహ్లీ ఉద్వేగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇక సెలవు.. అంటూ శనివారం సాయంత్రం వచ్చిన ఒక ప్రకటన భారత క్రికెట్ అభిమానులనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానించేవారిని షాక్‌కు గురి చేసింది.  ఈ పరిణామం ఏదో ఒక రోజు తప్పదని అందరూ అనుమానిస్తున్నప్పటికీ  తనకే సాధ్యమైన మెరుపు వేగంతో ఆ దిగ్గజం తన నిష్క్రమణను కూల్‌గా ప్రకటించాడు. 

మహేంద్ర సింగ్ ధోనీ. భారత్‌కు విజయాల రుచి చూపిన గ్రేటెస్ట్ కెప్టెన్.. విజయాన్ని, అపజయాన్ని సరిసమానంగా చూసిన కూలెస్ట్ పర్సన్ ధోనీ.. చిన్న ప్రకటనతో తన ప్రయాణం ముగిసింది అంటూ 15 ఏళ్ల కెరీర్‌కి ముగింపు పలికాడు. అదే దృఢచిత్తం. అదే కూల్ నెస్. కానీ అది ధోనీ తన కెరీర్‌లో సంధించిన చివరి షాట్ అంటే అతిశయోక్తి కాదు.

ప్రపంచ క్రీడా యవనికపై మిస్టర్ కూల్ అనిపించుకున్న ఏకైక క్రీడాకారుడు ధోనీ ఎవరెవరిమీద ఏ ప్రభావాలు వేశాడో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ క్రీడాభిమానులను కదిలించివేసింది.

MS Dhoni: Virat Kohli has almost attained legendary status ...

‘భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. నీతో కలిసి 2011 వరల్డ్‌ కప్‌ సాధించిన నా జీవితంలో మధుర ఘట్టం. నీ రెండో ఇన్నింగ్స్‌ బాగా సాగాలని కోరుకుంటున్నా’ 

సచిన్‌ టెండూల్కర్

‘ప్రతీ క్రికెటర్‌ ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగించాల్సిందే. అయితే నీకు అత్యంత ఆత్మీయులు అలా చేసినప్పుడు భావోద్వేగాలు సహజం. నీవు దేశానికి చేసింది ప్రతీ ఒక్కరి మదిలో గుర్తుండిపోతుంది. కానీ మన మధ్య పరస్పర గౌరవం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను’  

–విరాట్‌ కోహ్లి

‘భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ప్రపంచ క్రికెట్‌లో అతనో అద్భుతమైన ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని నాయకత్వ లక్షణాలకు మరెవరూ సాటి రారు. వన్డేల్లో అతని బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే’ – సౌరవ్‌ గంగూలీ

‘ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ధోని కెరీర్‌ ముగిస్తున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ సహచరుడిగా నీలాంటి ప్రొఫెషనల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ధోనికి సెల్యూట్‌’  

–రవిశాస్త్రి

‘ధోని లాంటి ఆటగాడు రావడం అంటే మిషన్‌ ఇంపాజిబుల్‌. ఎమ్మెస్‌ లాంటి వాడు గతంలోనూ, ఇప్పుడూ లేరు. ఇంకెప్పుడూ రారు. ఆటగాళ్లంతా వచ్చి పోతుంటారు కానీ అతనంత ప్రశాంతంగా ఎవరూ కనిపించరు. ఎందరో క్రికెట్‌ అభిమానుల కుటుంబ సభ్యుడిగా ధోని మారిపోయాడు. ఓం ఫినిషాయనమ’  

–వీరేంద్ర సెహ్వాగ్‌

‘గొప్ప కెరీర్‌ను ముగించినందుకు ధోనికి నా అభినందనలు. నీతో కలిసి ఆడటం నాకూ గౌరవకారణం. నాయకుడిగా నీ ప్రశాంత శైలితో అందించిన విజయాలు ఎప్పటికీ మధురానుభూతులే’ 

– అనిల్‌ కుంబ్లే

‘చిన్న పట్టణంనుంచి వచ్చి మ్యాచ్‌ విన్నర్‌గా, గొప్ప నాయకుడిగా ఎదిగిన ధోని ప్రయాణం అద్భుతం. నువ్వు అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను’ 

–వీవీఎస్‌ లక్ష్మణ్‌

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle