newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దయచేసి పాక్‌ను ఆదుకోండి.. భారత్‌ను అభ్యర్థించిన అక్తర్.. మిశ్రమ స్పందనలు

10-04-202010-04-2020 11:38:07 IST
Updated On 10-04-2020 11:43:16 ISTUpdated On 10-04-20202020-04-10T06:08:07.423Z10-04-2020 2020-04-10T06:07:58.311Z - 2020-04-10T06:13:16.883Z - 10-04-2020

దయచేసి పాక్‌ను ఆదుకోండి.. భారత్‌ను అభ్యర్థించిన అక్తర్.. మిశ్రమ స్పందనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన క్రీడా ఒప్పందాల్లో భాగంగా తరచూ భారత్ పర్యటిస్తూ భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడాలని, ఇరుదేశాలమధ్య సోదర సంబంధాలు తిరిగి ఏర్పడాలని పదే పదే ప్రకటిస్తూ ఉండే పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్ అక్తర్ తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌ను వేడుకున్నంత పని చేశాడు. తమ దేశంలో కరోనా వైరస్‌ని నియంత్రించడానికి భారత్ సాయం చేయాలంటూ అక్తర్ విన్నవించాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవన్నాడు. ఈ విషయంలో తమను భారత్‌ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

‘మాకు ప్రస్తుతం 10వేలకు పైగా వెంటిలేటర్లు అవసరం. వెంటిలేటర్లు లేక మా దేశం మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ విషయంలో సాయం చేయడానికి భారత్‌ ముందుకు రావాలి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మానవతా కోణంలో మాకు సాయం చేయండి. మిగతా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌ చొరవచూపాలి. ఈ విషయంలో ఇరు దేశాలు ఏకం కావాలి’ అని అక్తర్‌ కోరాడు. ఇప్పటివరకూ పాకిస్తాన్‌లో 4,263 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో సుమారు 60 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

అదే సమయంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య వన్డే సిరీస్‌  జరపాలను ప్రతిపాదనను కూడా అక్తర్‌ తీసుకొచ్చాడు. ప్రస్తుతం భారత్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని, దాంతో ఇరు దేశాలు మూడు వన్డేల సిరీస్‌ ఆడితే విరాళాలు సేకరించవచ్చన్నాడు. ఈ విరాళాలు ఇరు దేశాలు కరోనాపై చేస్తున్న పోరాటంలో ఉపయోగపడతాయని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లను ప్రేక్షకుల్ని అనుమతించకుండా టీవీల్లో వీక్షించే విధంగానే పరిమితం చేయాలన్నాడు. తటస్థ వేదికగా దుబాయ్‌ను అక్తర్‌ సూచించాడు. 

2007 తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్ జరుగలేదు. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో, ఆసియా కప్‌లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. 

కరోనా వైరస్ నిరోధం విషయంలో పాక్‌కి కావలసిన వైద్య సామగ్రిని భారత్ అందిస్తే ఆ సహాయాన్ని పాకిస్తాన్ ఎన్నడూ మర్చిపోలేదని అక్తర్ చెప్పాడు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటంలో అత్యంత కీలకమైనవి అత్యవసరమైన వైద్య సామగ్రి సరఫరానే. అభివృద్ధి చెందిన, చెందుతున్న ప్రతి దేశం ఇప్పుడు ఫేస్ మాస్క్‌లు, వెంటిలేటర్లు, కీలకమైన మందులకోసం కొట్టుమిట్టులాడుతోందన్నది నిజం. అక్తర్ అభ్యర్థనలో కూడా ఈ ఆరాటమే కనిపించి భారత్‌లో అతడి అభిమానులు సానుభూతి తెలుపుతున్నారు.

పాకిస్తాన్‌లో కరోనా వైరస్‌పై సమరంలో తలమునకలై ఉన్న మాజీ పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఫౌండేషన్‌కు తమ వంతు సహాయం అందించిన టీమిండియా మాజీ క్రికెటర్లు హర్బజన్ సింగ్, యువరాజ్ సింగ్‌లపై విమర్శించినవారిని అక్తర్ ఖండించాడు. మానవజాతి కరోనా వైరస్ వ్యతిరేక పోరాటంలో పరస్పర సహకారం అందించుకోవలసిన తరుణంలో భారత క్రికెటర్లు చూపిన ఔదార్యాన్ని విమర్శించడం అమానవీయమైన చర్య అంటూ అక్తర్ విమర్శించాడు.

అయితే పాకిస్తాన్‌కు భారత్ వైద్యపరమైన సహాయం చేయాలని అక్తర్ నేరుగా చేసిన ప్రకటన సోషల్ మిడియాలో వైరల్ అయింది. షోయబ్ అక్తర్ భారత్ సహాయం కోరుతున్నాడంటే పాకిస్తాన్ ప్రభుత్వంపై, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అక్తర్ నమ్మకం కోల్పోయాడనే కదా అర్థం అంటూ నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle