దటీజ్ ధోనీ... ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపిన సీఎస్కే
20-09-202020-09-2020 07:21:37 IST
2020-09-20T01:51:37.073Z20-09-2020 2020-09-20T01:51:33.588Z - - 22-04-2021

ఐపీఎల్ గత పన్నెండేళ్లుగా ఎందుకంత సంచలనం కలిగిస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తోందో శనివారం దుబాయ్‌లో మొదలైన 13వ సీజన్ మొదటి రోజు మొదటి మ్యాచే బోధపరిచింది. వృద్ధయోధులుగా పేరుపడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యధాప్రకారం జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ఎత్తుగడలతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టును కుమ్మేసింది. అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లో కూడా దుమ్ములేపిన సీఎస్కే తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవలే వీడ్కోలు పలికిన ఎమ్ఎస్ ధోనీ వచ్చీ రాగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్కే ఆరు పరుగులకే ఓపెనర్లను కోల్పోయినప్పటికీ అంబటిరాయుడు పవర్ బ్యాటింగ్, డుప్లెసిసి బాధ్యతాయుత ప్రదర్శన, ఆల్ రౌండర్ సామ్ కరన్ చివర్లో ప్రదర్శించిన మెరుపు బ్యాటింగ్ తోడుగా ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసి తొలి మ్యాచ్‌ను గెల్చుకుంది. ప్రత్యర్థి విసిరిన 163 పరుగల లక్ష్య ఛేదనలో భాగంగా సీఎస్కే ఆరు పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్(1), షేన్ వాట్సన్(4) వికెట్లను ఆదిలోనే కోల్పోయినప్పటికీ రాయుడు మాత్రం చూడచక్కని షాట్లతో మెరిపించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒకవైపు మంచి బంతుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా చెత్త బంతి అనిపిస్తే బౌండరీకి పంపించడానికి ఏమాత్రం వెనుకాడలేదు. బౌలర్ ఎవరైనా టైమింగ్‌తో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దాంతో సీఎస్కే 14.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి ఒక్కసారిగా ట్రాక్‌లోకి వచ్చేసింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వాట్సన్‌ను పాటిన్సన్ ఎల్బీగా పెవిలియన్‌కు పంపగా, మురళీ విజయ్ను బౌల్ట్ ఎల్బీగా ఔట్ చేశాడు. దాంతో రెండో ఓవర్లోనే సీఎస్కే కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాయుడు-డుప్లెసిస్‌ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. కాగా, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 పరుగులు చేసిన తర్వాత రాయడు మూడో వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో ఆల్‌రౌండర్ సామ్ కరాన్ ఆరు బంతుల్లో రెండు సిక్స్‌లు, 1 సిక్స్‌తో బ్యాట్ ఝుళిపించాడు. బౌల్ట్ వేసిన 20 ఓవర్ తొలి రెండు బంతుల్ని డుప్లెసిస్ వరుసగా ఫోర్లు కొట్టడంతో చెన్నై ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొదట్లో మెరుపులు, చివర్లో వికెట్ల పతనంతో రోహిత్ సేన తడబాటు ఈ మ్యాచ్‌లో తొలుత సీఎస్కే టాస్ గెలవడంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై 162 పరుగులు చేసింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే రోహిత్ ఫోర్ కొట్టాడు. ఆపై డీకాక్‌కు కూడా బ్యాట్ ఝుళింపించాడు. వీరిద్దరూ నాలుగు ఓవర్ల ముగిసేసరికి 45 పరుగులు సాధించి రన్‌రేట్‌ను పదికి పైగా ఉంచారు. కాగా, మ్యాచ్ ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. తొలుత ఓపెనర్లు రోహిత్, క్వింటన్ డికాక్ వెంటవెంటనే ఔట్ కావడం, సూర్యకుమార్ యాదవ్(17), సౌరవ్ తివారీల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టడం.. తర్వాత తివారీ, హార్దిక్ పాండ్యా వరుసగా పెవిలియన్ చేరడం, చివర్లో వికెట్లు టపటపా రాలడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 2019 సీజన్‌ని పునరావృతం చేస్తూ రోహిత్ నేతృత్వం లోని ముంబై ఇండియన్స్ జట్టు మళ్లీ సీఎస్కే చేతిలో తొలిపరాజయం నమోదు చేసింది. ధోనీ వ్యూహం ప్రకారం జట్టు బ్యాటింగ్‌ని నిర్దేశించడమే కాకుండా జట్టు అవసరాల మేరకు 7వ స్థానంలో వచ్చి ఆశ్చర్యపరిచినా ముంబై జట్టుకు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 163 పరుగుల విజయలక్ష్యాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టని సీఎస్కే జట్టు చివరి ఓవర్ వరకు పోరాడుతూనే ప్రత్యర్థిపై కీలకసమయంలో పైచేయి సాధించి తనను తక్కువగా అంచనా వేయవద్దని మరోసారి సవాల్ విసిరింది. తిరుగులేని ధోనీ రివ్యూ సిస్టమ్ బౌలింగ్, బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగులో కూడా మెరుపు ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్ రౌండర్ ప్రతిభతోనే తొలి విజయం నమోదు చేసుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో హైలైట్ ఏమిటంటే ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పేరొందిన డీఆర్ఎస్ రివ్యూలో ధోనీ అంచనా మరోసారి తిరుగులేని విధంగా రుజువు కావడమే.. 7వ స్థానంలో మైదానంలోకి అడుగుపెట్టిన ధోనీ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దనే బుమ్రా బౌలింగ్‌లో బంతిని మిస్ చేయడంతో అంపైర్ ఆలోచించకుండానే ఔట్ ఇచ్చాడు. ధోనీ కూల్‌గా ఆ నిర్ణయాన్ని రివ్యూకు పంపగా ధోనీ నాటౌట్ అని తేలింది.

RCBvsRR: బెంగళూరు వరుస విజయాలకు రాజస్థాన్ బ్రేక్ వెయ్యగలదా?
5 hours ago

చెన్నై సూపర్ కింగ్స్ ను టెన్షన్ పెట్టగా.. చివరికి..!
13 hours ago

CSK vs KKR: ధోని కెప్టెన్సీ ముందు KKR నిలిచేనా?
21-04-2021

SRH లక్ష్యం 120 ఛేదించేనా తడబడేనా?
21-04-2021

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
21-04-2021

ధోని తల్లిదండ్రులకు కరోనా..!
21-04-2021

రోహిత్ శర్మకు భారీ జరిమానా..!
21-04-2021

DC vs MI: ముంబై బౌలింగ్ ధాటికి.. ఢిల్లీ బ్యాటమెన్ నిలవగలరా..!
20-04-2021

రాజస్థాన్ ను చిత్తు చేసిన చెన్నై
20-04-2021

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
19-04-2021
ఇంకా