newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దటీజ్ ధోనీ.. అడక్కున్నా బిజినెస్ క్లాస్ సీటు ఇచ్చి షాకిచ్చాడు

23-08-202023-08-2020 08:30:53 IST
2020-08-23T03:00:53.082Z23-08-2020 2020-08-23T03:00:49.141Z - - 12-04-2021

దటీజ్ ధోనీ.. అడక్కున్నా బిజినెస్ క్లాస్ సీటు ఇచ్చి షాకిచ్చాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా ప్రయోజనాలకు అన్నిటికంటే ప్రాధాన్యత ఇచ్చి కెరీర్ మొత్తంలో అదే బాటలో నడిచిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇతరుల సౌకర్యాన్ని ఎక్కువగా పట్టించుకుంటాడన్నది తెలిసిన విషయమే. జట్టు సభ్యులు మైదానానికి బస్సులో వెళుతున్న సమయంలోనూ ముందు సీట్లు ఇతరులకు ఇచ్చి తాను వెనుక సీటులో కూర్చోవడంలోనూ ధోనీ ఆదర్శప్రాయంగానే వ్యవహరించేవాడు.

తన సౌకర్యాన్ని ఏమాత్రం చూసుకోకపోవడం, ఎదుటివారితో దయ కలిగి వ్యవహరించడం, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కారణంగానే ఎంఎస్ ధోనీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్ కెరీర్ నుంచి  ఆకస్మికంగా పదవీవిరమణ ప్రకటించిన ధోనీ తాజాగా తన దయాస్వభావాన్ని మరోసారి వ్యక్తం చేశాడు.  త్వరలో జరిగే ఐపీఎల్-2020 కోసం సీఎస్‌కే జట్టు శుక్రవారం యూఏఈ బయల్దేరిన సందర్భంగా.. ఈ జార్ఖండ్ డైనమైట్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నాడు. ధోనీ తన కోసం బిజినెస్ క్లాస్ సీటు వదిలేసి వెళ్లి ఎకానమీలో కూర్చున్నట్టు సీఎస్‌కే డైరెక్టర్ జార్జ్ జాన్ ట్విటర్లో వెల్లడించారు.

సీఎస్‌కే డైరెక్టర్ జార్జ్ కాళ్లు పొడుగ్గా ఉండడంతో ఆయన విమానంలోని ఎకానమీ క్లాస్ సీట్లో కూర్చునేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. దీన్ని గమనించిన ధోనీ.. తన సీటు ఆయనకు ఇచ్చేశాడు. ‘‘క్రికెట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఓ వ్యక్తి ఏమన్నాడంటే... ‘మీ కాళ్లు చాలా పొడుగ్గా ఉన్నాయి. రండి.. నా సీట్లో కూర్చొండి. నేను ఎకానమీలో కూర్చుంటాను..’’ అని అన్నాడు. కెప్టెన్‌ని చూసి ఎప్పుడూ సంభ్రమాశ్చర్యాలకు గురౌతూ ఉంటాను..’’ అని జార్జ్ పేర్కొన్నారు. 

గతంలో కూడా ధోనీ బిజినెస్ క్లాసులో వెళ్లేందుకు అంతగా ఇష్టపడేవాడు కాదని ప్రముఖ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. తనకు బిజినెస్ క్లాసు సీటు ఉన్నా ఎకానమీలో కూర్చుని అందరితో ముచ్చట పెట్టుకునేందుకే అతడు ఇష్టపడేవాడనీ ఆయన పేర్కొన్నారు. 

ఈ వీడియోను షేర్ చేసిన కాస్సేపటికే 3 వేల వ్యూలు వచ్చాయి. ధోనీ నమ్రతను, నేల విడవని సాదా సీదా తనాన్ని నెటిజన్లు మరోసారి కొనియాడుతున్నారు. 

చెన్నై క్యాంపులో ఆరు రోజుల శిక్షణను ముగించుకున్న చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు సభ్యులతోపాటు ధోనీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి పయనమయ్యారు. ఈ శిక్షణా శిబిరంలో ఉండగానే ధోనీ తన రిటైర్మెంటును ప్రకటించాడు.

యూఏఈలో ఆరురోజులు స్వీయ ఏకాంతంలో గడిపనున్న టీమ్ సభ్యులందరూ బయో సెక్యూర్ బబుల్‌లోకి అడుగుపెట్టేముందు కనీసం 5 పరీక్షలు చేయించుకుంటారని తెలుస్తోంది.

ఐపీఎల్‌ ఆడేందుకు దుబాయ్‌ వెళ్లిన రాజస్తాన్, పంజాబ్‌ జట్టు హోటల్లోనే ఆటగాళ్లు  క్వారంటైన్‌ అయ్యారు. అవకాశం దొరికితే బయటకు వెళ్లే భారత ఆటగాళ్లకు ఇది పూర్తిగా కొత్త కావడంతో కొంత ఇబ్బందిగానే అనిపిస్తోంది. హోటల్‌ గదులకే పరిమితమైన ఆటగాళ్లు... అప్పుడప్పుడు మాత్రం బాల్కనీల్లో మాత్రమే ఒకరితో ఒకరు ముచ్చటించుకున్నారు. ఇక ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ చెప్పినట్లుగా గదుల్లో చేయదగిన చిన్నపాటి వర్కవుట్లు చేశారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాత్రం అబుదాబీలోని హోటల్లో బసచేసింది. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్, ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు శుక్రవారం యూఏఈ గడ్డపై అడుగు పెట్టాయి. మరో రెండు టీమ్‌లు సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రమే అక్కడికి వెళ్లాల్సి ఉంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle