newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీలో అదరగొట్టేశాడు.

19-07-202019-07-2020 16:46:35 IST
2020-07-19T11:16:35.991Z19-07-2020 2020-07-19T11:16:32.762Z - - 23-04-2021

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీలో అదరగొట్టేశాడు.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీలో అదరగొట్టేశాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఈ పవర్ హిట్టర్.. ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 

కానీ.. దక్షిణాఫ్రికా టీమ్ తరఫున మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడాలని ఉందని ఏబీ డివిలియర్స్ గత ఏడాది తన మనసులో మాట చెప్పగా.. పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అయితే.. ఆ జట్టు కోచ్, మాజీ కెప్టెన్ డుప్లెసిస్‌ అతనికి సపోర్ట్‌గా నిలవడంతో.. డివిలియర్స్ రీఎంట్రీకి దారులు తెరుచుకున్నాయి. 

దాంతో.. రీఎంట్రీకి సరైన వేదిక కోసం ఎదురుచూసిన ఏబీ డివిలియర్స్.. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ల మధ్య కొత్త తరహాలో జరిగిన 3టీసీ క్రికెట్ సాలిడారిటీ కప్‌లో ఒంటిచేత్తో టీమ్‌కి విజయాన్ని అందించాడు. 24 బంతుల్లో ఏకంగా 61 పరుగులు చేసిన ఏబీడీ.. తాను కెప్టెన్సీ వహించిన ఈగల్స్ టీమ్‌ గోల్డ్‌ మెడల్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.

కరోనా వైరస్ నేపథ్యంలో.. మార్చి నుంచి దక్షిణాఫ్రికాలో క్రికెట్ సిరీస్‌లకి బ్రేక్‌లుపడగా.. మళ్లీ ఆటగాళ్లకి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ని ఇప్పించాలని భావించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ 3టీసీ క్రికెట్ సాలిడారిటీ కప్‌‌ని తెరపైకి తెచ్చింది.

సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాళ్లతో పాటు దక్షిణాఫ్రికా టీమ్‌కి ఆడాలనుకుంటున్న క్రికెటర్లతో.. జట్టుకి 8 మంది చొప్పున మూడు జట్లని బోర్డు ఏర్పాటు చేసింది. 

ఒక్కో జట్టు ఆరేసి ఓవర్లు చొప్పున రెండు సార్లు.. అంటే మొత్తం 12 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. మొత్తంగా.. అత్యధిక స్కోరు చేసిన జట్టుని విజేతగా ప్రకటించారు.

ఫస్ట్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో 11 పరుగులకే ఔటైన ఏబీ డివిలియర్స్.. రెండోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా భారీ సిక్సర్లు బాదిన ఏబీడీ.. 21 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదడంతో పాటు మొత్తంగా 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు.

3టీసీ క్రికెట్ సాలిడారిటీ కప్‌లో పోటీపడిన.. ఈగల్స్ టీమ్‌కి బంగారు పతకం, కైట్స్ టీమ్‌కి రజతం, కింగ్‌ఫిషర్ టీమ్‌కి కాంస్య పతకం లభించింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle