newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఘనవిజయం

08-01-202008-01-2020 08:45:28 IST
2020-01-08T03:15:28.607Z08-01-2020 2020-01-08T03:15:25.212Z - - 23-04-2021

దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఘనవిజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లాండ్ జట్టు 189 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. రెండో టెస్ట్ లో విజయం సాధించిన ఈ సిరీస్ ను 1-1 సమం చేసింది. ఇంగ్లాండ్ జట్టు విధించిన 438 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ టెస్ట్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన బెన్ స్ట్రోక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్ట్ పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జనవరి 16 నుండి ప్రారంభం కానుంది. 

ఓవర్ నైట్ స్కోరు 126/2 పరుగుల వద్ద బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు వెంటనే నైట్ వాచ్ మాన్ మహారాజ(2) వికెట్ నష్టపోయింది. ప్రొటీస్ జట్టు కెప్టెన్ డుప్లిసిస్ తో కలిసి మలన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 35 పరుగులు జోడించిన తరువాత ఈ జోడీని బెస్ వేరు చేశాడు. డుప్లిసిస్ (19) జట్టు స్కోరు 164 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

ఆ వెంటనే మలన్(84) కూడా పెవిలియన్ చేరడంతో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి దిశగా సాగింది. ఈ దశలో డికాక్-డస్సేన్ జోడి క్రీజులో నిలదొక్కుకున్నారు. టెస్ట్ మ్యాచ్ కు నిర్వచనం లాగా డస్సేన్ ఇన్నింగ్స్ సాగింది.

డికాక్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. 6వ వికెట్ కు 66 పరుగులు జోడించిన తరువాత డికాక్(50) ఔట్ కావడంతో సౌత్ ఆఫ్రికా జట్టు ఓటమి ఖరారైంది. ఆ వెంటనే డస్సేన్ (17), ఫిలాండర్(8), ప్రిటోరియస్(0), రిచ్(0) పెవిలియన్ చేరడంతో సౌత్ ఆఫ్రికా జట్టు 248 పరుగులకు ఆలౌట్ అయింది. రబడా(3) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

 

 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle