newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్

07-01-202007-01-2020 08:12:38 IST
2020-01-07T02:42:38.990Z07-01-2020 2020-01-07T02:38:26.279Z - - 23-04-2021

దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేప్‌టౌన్‌ వేదికగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్ జట్టు విధించిన 438 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

ఒక్క రోజు మిగిలి ఉన్న ఆటలో దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్ లో గెలవాలంటే ఇంకా 312 పరుగులు చేయవలసి ఉంది. ఇంగ్లాండ్ జట్టు సిరీస్ ను 1-1 తేడాతో సమం చేయాలంటే 8 వికెట్లు తీయవలసి ఉంది. 

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఎల్గార్(88), వెన్ డస్సన్(68) మంచి ఇన్నింగ్స్ లు ఆడినా మిగిలిన వారి నుండి సరైన సహకారం అందక పోవడంతో తమ తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులకు ఆలౌట్ అయింది.

46 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. డొమినిక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయడంతో బాటు కెప్టెన్ రూట్, బెన్ స్ట్రోక్స్ హాఫ్ సెంచరీస్ తోడవడంతో ఇంగ్లాండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 391/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 

ఇంగ్లాండ్ జట్టు విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించింది. మలన్ తో కలిసి ఎల్గార్ తొలి వికెట్ కు 71 పరుగులు జోడించారు.

ఈ దశలో ఎల్గార్(34) పెవిలియన్ చేరడంతో ఫస్ట్ డౌన్ లో హంజా వచ్చాడు. మలన్ తో కలిసి 52 పరుగులు జోడించిన తరువాత హంజా(18)ని అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. నైట్ వాచ్ మాన్ గా వచ్చిన మహారాజ్(2)తో కలిసి మలన్(63) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ జట్టును 126 పరుగులకు చేర్చాడు.

 

 



      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle