newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

తొలి సెమీ ఫైనల్‌లో పోరాడి ఓడిన భారత్

10-07-201910-07-2019 19:25:56 IST
Updated On 10-07-2019 19:32:38 ISTUpdated On 10-07-20192019-07-10T13:55:56.935Z10-07-2019 2019-07-10T13:55:54.362Z - 2019-07-10T14:02:38.274Z - 10-07-2019

తొలి సెమీ ఫైనల్‌లో పోరాడి ఓడిన భారత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ‌క‌ప్ తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో భార‌త్ చివరి వరకూ పోరాడినా ఓటమి పాలైంది. భారత్ 240 పరుగుల లక్ష్యం కోసం ప్రయత్నించి 221 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. వరుసగా వికెట్లు పడి,  ఆశ‌లు స‌న్నగిల్లిన స‌మ‌యంలో ఆల్‌రౌండ‌ర్ స్ఫూర్తిదాయ‌క ఇన్నింగ్స్‌తో జడేజా ఆక‌ట్టుకున్నాడు.

న్యూజిలాండ్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది.ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ , కోహ్లి, రాహుల్ ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. ఇక కొద్దిసేపు నిలకడగా ఆడినట్టే కనిపించిన దినేష్ కార్తీక్ కూడా తక్కువ పరుగుల వ్యవధిలోనే అవుట్ అయ్యాడు.

వర్షం కారణంగా మంగళవారం ఆగిపోయిన మ్యాచ్ బుధవారం తిరిగి ప్రారంభించిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. టీమిండియా ఫైనల్‌ చేరేందుకు 240 పరుగుల మంచి లక్ష్యం నిర్దేశించింది. చల్లని వాతావరణం, పిచ్‌ మందకొడిగా మారడంతో లక్ష్య ఛేదన కోహ్లీసేన చివరివరకూ పోరాటం చేసింది. 221 పరుగులకు వికెట్లన్నీ కోల్పోయింది. ఇంగ్లాండ్‌తో మినహాయిస్తే వరుస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన ప్రయాణం సెమీస్‌తో నిలిచిపోవడం గమనార్హం. దీంతో ప్రపంచకప్ లో భారత్ కథ ముగిసింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle