newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తొలి మ్యాచ్ కు సీఎస్కే రెడీయేనా? ఐపీఎల్ లేటయ్యేనా?

30-08-202030-08-2020 10:41:10 IST
Updated On 30-08-2020 10:44:34 ISTUpdated On 30-08-20202020-08-30T05:11:10.837Z30-08-2020 2020-08-30T05:11:06.392Z - 2020-08-30T05:14:34.091Z - 30-08-2020

తొలి మ్యాచ్ కు  సీఎస్కే రెడీయేనా? ఐపీఎల్ లేటయ్యేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్ సెప్టెంబర్‌ 19నుండి ప్రారంభం కానుంది. గతంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్‌ 19న డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఐపీఎల్ ఓపెనింగ్ గేమ్ జరగాల్సి ఉంది. అయితే టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై తలపడే అవకాశం ఇప్పుడు లేదు. తొలి మ్యాచ్‌ ఆడేందుకు సీఎస్‌కే ఇంకా సన్నద్ధం కాలేదు.

అందరి కంటే ముందే ఆగష్టు 21న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు దుబాయ్‌కు వెళ్లింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం ఆ రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉంది. ఐపీఎల్‌లోని మిగిలిన ఏడు జట్లు కూడా యూఏఈకి చేరుకుని ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాయి.ఏ జట్టులోనూ కనీసం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

కానీ చెన్నై టీమ్‌లో ఏకంగా 12 కరోనా కేసులు బయటపడ్డాయి. శుక్రవారం ఈ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 10 మంది సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. వైరస్ సోకని చెన్నై ఆటగాళ్లు కూడా మరో 6 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఇక కరోనా ఉన్నవారు రెండు వారాల పాటు క్వారంటైన్‌ నిబంధనలను పాటించాలి. దీంతో ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు. 

దీనికితోడు సీపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లు 17-18 తేదీలలో దుబాయ్‌ వచ్చి.. 6 రోజుల క్వారంటైన్‌ పూర్తి చేయాలి. దీంతో వారు లీగ్ మొదటివారం మ్యాచులకు దూరమవుతారు. మరోవైపు చెన్నై స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఐపీఎల్‌ 2020 నుంచి తప్పుకున్నారు. రైనా నిష్క్రమణ, ఆటగాళ్లకు కరోనా సోకడం, విదేశీ ఆటగాళ్ల క్వారంటైన్‌ సమయంతో చెన్నై ప్రాంచైజీ తలపట్టుకుంది.

ప్రస్తుతం చెన్నైకి ఉన్న కష్టాల ప్రభావం ఐపీఎల్ 2020 లీగ్‌ ఆరంభ మ్యాచ్‌పై పడే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ భావిస్తోంది. చెన్నై ఇప్పుడు ఐపీఎల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్ ఆడే స్థితిలో లేదు. 

ఎదురుదెబ్బ నుంచి బయటపడటానికి చెన్నైకి మరికొన్ని రోజులు సమయం ఇస్తాం అని ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. చెన్నైకి మొదటి వారంలో మ్యాచులు లేకుండా షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం ప్రస్తుతం బీసీసీఐ కసరత్తులు చేస్తోందట. అందుకే నిన్న విడుదల కావాల్సిన షెడ్యూల్ మరింత ఆలస్యం కానుంది.

మరోవైపు అనుకున్న దానికంటే ఆటగాళ్లపై ఆరంభంలోనే కరోనా వైరస్ ప్రభావం చూపడంతో అసలు ఐపీఎల్ 2020 సాధ్యమవుతుందా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్ల క్వారెంటైన్‌ ముగించుకుని ప్రాక్టీస్‌ ఆరంభించినా.. వైరస్‌ ఎటు నుంచి దాడి చేస్తోందనే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle