తొలి టెస్టు మ్యాచ్... పాక్ టీం ఇదే
05-08-202005-08-2020 08:12:49 IST
Updated On 05-08-2020 08:52:16 ISTUpdated On 05-08-20202020-08-05T02:42:49.756Z05-08-2020 2020-08-05T02:42:23.853Z - 2020-08-05T03:22:16.428Z - 05-08-2020

ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్‌కి జట్టుని పాకిస్థాన్ ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ టెస్టు ఆరంభంకానుండగా.. 16 మందితో కూడిన ఈ జట్టులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కి చోటు లభించింది. పాక్ తరఫున గత ఏడాది అక్టోబరులో చివరిగా సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంకతో గత ఏడాది పాక్ గడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాక్ ఓడిపోవడంతో.. ఆగ్రహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్ఫరాజ్ అహ్మద్‌ని కెప్టెన్సీ నుంచే కాకుండా టీమ్ నుంచి కూడా తప్పించింది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకి పాకిస్థాన్ జట్టు ఇదే: అజహర్ అలీ (కెప్టెన్), బాబర్ అజామ్, అబిద్ అలి, అసద్ షాఫిక్, పవాద్ అలామ్, ఇమామ్ ఉల్ హక్, ఖాసిప్ భట్టీ, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్, షదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, సొహైల్ ఖాన్, యాసీర్ షా ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య ఈ రోజు నుంచి మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌ని పూర్తి బయో- సెక్యూర్ వాతారణంలో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తోంది.ఈ మేరకు నెల రోజులు ముందుగానే పాకిస్థాన్ జట్టుని అక్కడికి రప్పించుకున్న ఈసీబీ.. కరోనా వైరస్ పరీక్షలు, 14 రోజులు క్వారంటైన్లో ఉంచి.. ఇరు జట్ల ఆటగాళ్లని బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చింది. ఒక్కసారి క్రికెటర్లు, మ్యాచ్ అధికారులు ఈ బబుల్‌లోకి ఎంటరైన తర్వాత సిరీస్ ముగిసే వరకూ వెలుపలికి రాకూడదు. పాక్‌తో తొలి టెస్ట్ మ్యాచ్.. ఇంగ్లండ్ టీం ఇదే

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
8 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
18 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
17 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా