newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

25-02-202025-02-2020 17:22:18 IST
2020-02-25T11:52:18.714Z25-02-2020 2020-02-25T11:52:13.011Z - - 20-04-2021

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘోరపరాజయంపై కపిల్ దేవ్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు విమర్శల దాడి మొదలెట్టినప్పటికీ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టించుకోలేదు. పైగా ఒక టెస్టు మ్యాచ్ ఓడిపోయినంతమాత్రాన ప్రపంచం ముగిసిపోయినట్లేనా అని ఎదురు ప్రశ్న వేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏదీ సులువు కాదు. ప్రతీ జట్టు విజయం కోసమే ప్రయత్నిస్తుంది. బయటి వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారో మేం పట్టించుకోం. అలా చేస్తే మళ్లీ ఏడు లేదా ఎనిమిది ర్యాంక్‌కు పడిపోతాం. వరుసగా టెస్టులు గెలుస్తున్న జట్టు స్థాయి ఒక్క మ్యాచ్‌తో తగ్గిపోదు అని కోహ్లీ ఓటమి పట్ల సమర్థించుకున్నారు.

మేం బాగా ఆడలేదని తెలుసు. కానీ కొందరు ఈ ఓటమిని అవసరానికి మించి పెద్దదిగా చేసి చూపిస్తున్నారు. మేం ఆ రకంగా ఆలోచించడం లేదు. దీంతో ప్రపంచం ముగిసిపోయినట్లు కాదు. క్రికెట్‌ మ్యాచ్‌లోనే ఓడాం. పరాజయాన్ని ఒప్పుకోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. న్యూజిలాండ్‌ బౌలర్లు మాపై ఒత్తిడి పెంచేలా మేమే అవకాశమిచ్చాం. ఒకటి రెండు మంచి భాగస్వామ్యాలతో వారిని అడ్డుకోవాల్సింది. నా బ్యాటింగ్‌ గురించి ఆందోళన లేదు. నేను బాగానే ఆడుతున్నా. ఇంత సుదీర్ఘ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడూ విఫలం కావడం సహజం. తర్వాతి టెస్టు కోసం మరింతగా శ్రమించి సన్నద్ధమవుతాం అని కోహ్లీ చెప్పాడు.

కాగా, న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఘోరపరాజయాన్ని బారత దిగ్గజ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా తొలి టెస్టు ఓటమిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పది వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియాకు తొలి ప్రపంచకప్‌ అందించిన సారథి కపిల్‌ దేవ్‌ టెస్టు ఓటమిపై స్పందిస్తూ పలు ప్రశ్నల వర్షం కురిపించాడు. 

‘వన్డే, తొలి టెస్టుల్లో కివీస్‌ ఆడిన తీరు అమోఘం. ఓటమి తర్వాత వారు పుంజుకున్న విధానం, సారథిగా విలియమ్సన్‌ ముందుండి నడిపించే విధంగా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే మేనేజ్‌మెంట్‌ను పలు ప్రశ్నలు అడగదల్చుకున్నా. ప్రతీ మ్యాచ్‌కు కొత్త జట్టా? పదకొండు మందితో కూడిన ఓ జట్టును వరుసగా మ్యాచులు ఆడించరా? ప్రతీ మ్యాచ్‌ కోసం జట్టులో మార్పులు చేస్తునే ఉంటారా? ఇలా మార్చుకుంటూ వెళ్లడం ద్వారా యువ ఆటగాళ్లకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారు? గత కొంతకాలంగా సీనియర్‌ ప్లేయర్స్‌ మినహా ఏ ఒక్క యువ ఆటగాడినైనా జట్టులో శాశ్వత స్థానం కల్పించారా? జట్టులో తన స్థానంపై నమ్మకం లేనప్పుడు ఆ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఏలా చేయగలడు?’ అంటూ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కపిల్‌దేవ్‌ ప్రశ్నించాడు.

‘బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రపంచ శ్రేణి మేటి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా తొలి టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో కూడా 200 పరుగులు చేయకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రతీసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు.. కొన్ని సార్లు పోరాడి జయించాలి. అంతేకాని పరిస్థితులకు దాసోహం కాకూడదు. తుది జట్టును ఎంపిక చేసేముందు ఆటగాడికి బలమైన నమ్మకాన్ని ఇవ్వాలి. ఈ విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనను తాను ప్రశ్నించుకోవాలి. ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను టెస్టు జట్టులోకి తీసుకోలేదు. టీ20, వన్డేల్లో పరుగులు రాబట్టిన ఆటగాడిని పక్కన కూర్చోబెట్టడంలో ఏమైనా అర్థం ఉందా? ఫామ్‌లో ఉన్న ఆటగాడిని ఆడించడం జట్టుకు, ఆ క్రికెటర్‌కు ఎంతో లాభం’ అంటూ కపిల్‌ దేవ్‌ పేర్కొన్నాడు.

ఏదేమైనా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గడ్డుకాలం మొదలైనట్లే అని చెప్పాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle