newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తొలి టెస్టులో ఊహించని ఓటమి... రెండో టెస్టులో ఇంగ్లండ్ అద్భుత విజయం

21-07-202021-07-2020 09:30:57 IST
2020-07-21T04:00:57.666Z21-07-2020 2020-07-21T04:00:52.211Z - - 17-04-2021

తొలి టెస్టులో ఊహించని ఓటమి... రెండో టెస్టులో ఇంగ్లండ్ అద్భుత విజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో గెలుపు లెక్కని ఇంగ్లాండ్ సరిచేసింది. మాంచెస్టర్ వేదికగా భారత కాలమాన ప్రకారం సోమవారం అర్ధరాత్రి ముగిసిన రెండో టెస్టులో అసాధారణ పోరాట పటిమని కనబర్చిన ఇంగ్లాండ్ టీమ్ 113 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ని ఓడించింది. 312 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 198 పరుగులకే ఆలౌటవగా.. మూడు టెస్టుల సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఇక విజేత నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్‌ మాంచెస్టర్ వేదికగానే శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.

గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్.. వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ 356 బంతుల్లో 176 పరుగులు, ఓపెనర్ డొమినిక్ సిబ్లే 372 బంతుల్లో 120 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌ని 469/9తో డిక్లేర్ చేసింది. 

తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 287 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్‌కి 182 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ బెన్‌స్టోక్స్ (78 నాటౌట్: 57 బంతుల్లో 4x4) ఓపెనర్‌గా వచ్చి మరీ మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌ని 129/3తో డిక్లేర్‌ చేసిన ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 182 పరుగులతో కలుపుకుని మొత్తం 312 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్ల ముందు ఉంచింది.

భారీ లక్ష్య ఛేదనని దూకుడుగా ఆరంభించబోయిన వెస్టిండీస్.. వరుసగా వికెట్లు చేజారడంతో ఆఖర్లో డిఫెన్స్ మంత్రాన్ని జపించింది. కానీ.. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఓపెనర్ క్రైగ్ బ్రాత్‌వైట్ (12), క్యాంప్‌బెల్ (4), షైహోప్ (7), రోస్టన్ ఛేజ్ (6), డార్విచ్ (0) తక్కువ స్కోరుకే ఔటవగా.. బ్రూక్స్ (62: 136 బంతుల్లో 4x4, 2x6), బ్లాక్‌వుడ్ (55: 88 బంతుల్లో 7x4), జేసన్ హోల్డర్ (35: 62 బంతుల్లో 5x4,1x6) ఆ జట్టుని ఓటమిని నుంచి రక్షించే ప్రయత్నం చేశారు.

ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్ (3/42), బెన్‌స్టోక్స్ (2/30), క్రిస్‌వోక్స్ (2/34) డొమినిక్ బెస్ (2/59) వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. మొత్తంగా.. 70.1 ఓవర్లలో 198 పరుగులకి వెస్టిండీస్ ఆలౌటవగా.. ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలిపోయింది.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle