newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తొమ్మిదేళ్ల తర్వాతా ఆ సిక్సర్ గురించే చర్చా.. రైనా క్లారిటీ

04-04-202004-04-2020 17:46:48 IST
Updated On 04-04-2020 17:48:44 ISTUpdated On 04-04-20202020-04-04T12:16:48.838Z04-04-2020 2020-04-04T12:14:18.437Z - 2020-04-04T12:18:44.086Z - 04-04-2020

తొమ్మిదేళ్ల తర్వాతా ఆ సిక్సర్ గురించే చర్చా.. రైనా క్లారిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో దేశం దేశమే తలమునకలై ఉంటోంది. కానీ గత కొన్నాళ్లుగా తొమ్మిదేళ్ల క్రితం భారత క్రికెట్‌లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చలకు దారి తీస్తోంది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో భారత్‌కు రెండో సారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సాధించి పెట్టిన ఘటన అది. అయితే భారత్‌కు రెండో సారి ప్రపంచ కప్ సాధించి పెట్టిన ఘనత ఎవరికి దక్కాలి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గౌతమ్ గంబీర్‌తో మొదలైన ఆ చర్చ ఇప్పుడు సురేష్ రైనా వద్దకువచ్చి ఆగింది. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ధోనీ చివరి ఓవర్లో బాదిన సిక్సర్‌తో శ్రీలంకపై గెలుపు సాధించిన భారత్ సగర్వంగా కప్పును రెండో సారి సొంతం చేసుకుంది. కానీ ఆ ఘనత మొత్తంగా ధోనీకే దక్కాలా అనే కోణంలో ప్రస్తుతం చర్చ సాగడం విశేషం. 

ఎంఎస్‌ ధోని సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలిచి తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే వన్డే ప్రపంచకప్‌ క్రెడిట్‌ ఎవరికి దక్కుతుంది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎంఎస్‌ ధోని, గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌, జహీర్‌ ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లలో ప్రపంచకప్‌ గెలవడంలో ఎవరు ప్రధాన పాత్ర పోషించారు. 

దీనికి సమాధానం కష్టం ఎందుకుంటే ప్రతీ మ్యాచ్‌లో ఒక్కరే జట్టును గెలిపించలేదు. దీంతో ఫైనల్‌ వరకు క్రెడిట్‌ అందరి ప్లేయర్స్‌కు దక్కింది. అయితే ఫైనల్‌ గెలుపు మాత్రం ఒక్కరికే ఆపాదించడం కొందరికి నచ్చడం లేదు. దీనిపై గౌతమ్‌ గంభీర్‌ బహిరంగంగానే విమర్శలకు దిగాడు. తాజాగా ఫైనల్‌ గెలుపుపై టీమిండియా సీనియర్‌ ఆటగాడు,  ఫ్యామిలీ మ్యాన్‌ సురేశ్‌ రైనా స్పందించాడు.

‘చిన్నప్పడు బ్యాట్‌ పట్టినప్పుడే అనుకున్నా ప్రపంచకప్‌ గెలిచే భారత జట్టులో సభ్యుడిగా ఉండాలని. ఆ కల నెరవేరి తొమ్మిదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఆ మ్యాచ్‌ తాలూకు జ్ఞాపకాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఫైనల్‌ వరకు మా ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో ఛేదనలో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. అయితే ఈ క్రమంలో గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లి జోడి మూడో వికెట్‌కు 83 పరుగులు నమోదుచేసి విజయానికి గట్టి పునాది వేశారు. నా దృష్టిలో టీమిండియా ప్రపంచకప్‌ ఫైనల్లో గెలవడంలో ఇదే టర్నింగ్‌ పాయింటని భావిస్తాను. ఒత్తిడిలోనూ వారిద్దరూ బాధ్యతాయుతంగా ఆడిన తీరు అద్భుతం.

అయితే విరాట్‌ కోహ్లి ఔటైన తర్వాత యువరాజ్‌ రావాల్సింది కానీ ఇద్దరు లెప్టాండర్స్‌ అవుతుండటం, ముత్తయ్య మురళీధరన్‌ వంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో సమర్థవంతంగా ఆడిన అనుభవం ఉండటంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఫైనల్‌ వంటి పోరులో మిడిల్‌ ఓవర్లలో వికెట్లు పడితే ఒత్తిడి పెరుగుతుంది. అయితే వికెట్లు పడకుండా, స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ ధోని, గంభీర్‌లు చాలా బాగా ఆడారు. అయితే సెంచరీకి మూడు పరుగుల దూరంలో గంభీర్‌ వెనుదిరగడం నిరుత్సాహపరిచింది. యువరాజ్‌తో కలిసి ధోని టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే గంభీర్‌-కోహ్లిలు మూడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నమోదు చేయకుంటే టీమిండియా విజయం అంత సులభం అయ్యేది కాదని నా భావన’ అంటూ రైనా పేర్కొన్నాడు. 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   12 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle