తెలుగు సాంగ్స్‌కి కెవిన్ పీటర్సన్ డ్యాన్స్ అదుర్స్
12-05-202012-05-2020 11:29:11 IST
Updated On 12-05-2020 11:51:52 ISTUpdated On 12-05-20202020-05-12T05:59:11.582Z12-05-2020 2020-05-12T05:59:04.892Z - 2020-05-12T06:21:52.252Z - 12-05-2020

ఈమధ్యకాలంలో టిక్ టాక్ చాలా పాపులర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ క్వారంటైన్ వేళ సినితారలే కాదు క్రికెటర్లు కూడా తమ ఖాళీ టైంని ఫ్యామిలీ కోసం కేటాయిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ లాక్డౌన్ వేళ చాలా యాక్టీవ్ గా ఉన్నాడు. సోషల్ మీడియాలో తెలుగు పాపులర్ సాంగ్స్ తీసుకుని డ్యాన్సులు చేసి ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. లేటెస్టుగా 1993లో అర్జున్ హీరోగా వచ్చిన జెంటిల్మెన్ మూవీలోని కొంటెగాణ్ణి కట్టుకో సాంగుకు వెరైటీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. ఈ వీడియోను చూసిన ఆ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. కరోనా ప్రభావంతో స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ నిలిచిపోయి ఆటగాళ్లకు ఏం తోచడం లేదు. దాంతో సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈమధ్యనే టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేశాడు. పోకిరి సినిమాలో మహేశ్‌బాబు పంచ్ డైలాగ్‌ను ఇమిటేట్ చేశాడు. అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీలోని బుట్టబొమ్మ సాంగ్ ఖండాలు దాటి మరి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. క్రికెటర్ వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేయడం మాములు విశేషం కాదు. అలాగే బాలీవుడ్‌లోని పలువురు సెలబ్రిటీలు కూడా డ్యాన్స్ లు చేశారు. అల్లు అర్జున్ కూతురు కూడా ఈ పాటకు తన పెదవులు కలిపింది.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
11 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
21 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
21 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా