newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

తప్పుడు అంపైరింగ్‌కు సచిన్ బలయ్యాడు.. స్టీవ్ బక్నర్ క్షమాపణ

23-06-202023-06-2020 11:29:18 IST
Updated On 23-06-2020 11:41:59 ISTUpdated On 23-06-20202020-06-23T05:59:18.332Z23-06-2020 2020-06-23T05:59:14.895Z - 2020-06-23T06:11:59.871Z - 23-06-2020

తప్పుడు అంపైరింగ్‌కు సచిన్ బలయ్యాడు.. స్టీవ్ బక్నర్ క్షమాపణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ ప్రపంచంలో‌ని దిగ్గజ అం​పైర్లలో ఒకరైన స్టీవ్‌ బక్నర్‌ మైదానంలో తాను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. రెండు సార్లు తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెండు సందర్భాల్లోనూ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ బలయ్యాడని చెప్పారు. అయితే, అవన్నీ పొరపాటు నిర్ణయాలేననని వెల్లడించారు. మాన్సన్‌ అండ్‌ గెస్ట్స్‌ అనే రేడియా కార్యక్రమంలో బక్నర్‌ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

‘2003 గాబా టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ వేసిన బంతికి సచిన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, ఆ బంతి వికెట్ల పైనుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్టు రిప్లేలో తేలింది. మరోసారి 2005 కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్‌ బౌలర్‌ అబ్దుల్‌ రజాక్‌ వేసిన బంతికి సచిన్‌ను క్యాచ్‌ ఔట్‌గా ప్రకటించా. కానీ, తర్వాత తెలిసింది, అది బ్యాట్‌కు తాకనే లేదని. మనుషులన్నాక పొరపాట్లు సహజం. అయితే,  వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్‌ కూడా తప్పుడు నిర్ణయాలు కావాలని తీసుకోడు. 

ఈడెన్‌ గార్డెన్స్‌లో కిక్కిరిసిన అభిమానుల హర్షధ్వానాలే రెండో పొరపాటుకు కారణమని భావిస్తున్నా. లక్ష మంది ఆ మ్యాచ్‌ వీక్షిస్తుండటంతో బంతి బ్యాట్‌కు తగిలింది లేనిది గ్రహించలేకపోయా. నా నిర్ణయాలకు చింతిస్తున్నా. వాటి వల్లే నా కెరీర్‌ ప్రమాదంలో పడొచ్చని అనుకుంటున్నా. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు’ అని బక్నర్‌ అన్నారు. 

ఇక క్రికెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డీఆర్‌ఎస్‌ పద్ధతి పొరపాటు నిర్ణయాలు సమీక్షించుకునేందుకు చక్కని అవకాశాలు ఇచ్చాయన్నారు. అవి అంపైరింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పలేను కానీ, నిర్ణయాల్లో కచ్చితత్వం తెస్తాయని మాత్రం చెప్పగలనని బక్నర్‌ పేర్కొన్నారు. 

కలకత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో లక్షమంది ప్రేక్షకులు సమక్షంలో అంపైరింగ్ చేయడం ఏ అంపైర్ కైనా అత్యంత కష్టమైన విషయమని దిగ్గజ అంపైర్ స్టీవ్ బక్నర్ వివరించారు. లక్షమంది సమక్షంలో ఈడెన్ గార్డెన్‌లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అందులోనూ టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల హోరు తప్ప మరింతే శబ్దం వినబడదని అలాంటి క్షణాల్లో బంతి బ్యాట్‌కు తగిలిందా లేదా అని నిర్ణయించి ఔట్ ఇప్వడం, ఇవ్వకపోవడం అంపైర్ ముందున్న అతిపెద్ద సవాలుగా ఉంటుందని స్టీవ్ అభిప్రాయపడ్డారు.

లక్షమంది జనం చేసే శబ్దాల హోరు ముందు తప్పు నిర్ణయాలు చేయడం మానవ సహజమని, అలాంటి తప్పులను అంగీకరించడం కూడా జీవితంలో భాగమేనని బక్నర్ చెప్పారు. తాను చేసిన తప్పుకు సచిన్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మన్ ఔటయినప్పుడు ఆరోజు రాత్రి నిద్ర సరిగా పట్టేది కాదని, ఆట ముగిసిన రోజు అంపైర్‌ గాఢంగా నిద్రపోయాడంటే ఆరోజు తననుంచి ఏ తప్పు నిర్ణయం జరగలేదనే అర్థమని స్టీవ్ వివరించారు.

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

జెర్మన్ బ్లాక్ వుడ్ వీరవిహారం.. ఆతిథ్య దేశానికి షాక్

   3 hours ago


కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

కోహ్లీని ఆర్సీబీ ఏనాడూ లెక్కపెట్టలేదు.. కప్పు ఎలా గెలుస్తాడు.. చోప్రా ధ్వజం

   12-07-2020


ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

ఇంగ్లాండ్‌కి చెమటలు పట్టించిన విండీస్ టీం

   11-07-2020


కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

కోహ్లీపై వత్తిడి పెరుగుతోందా?

   11-07-2020


ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

ఆ మాట చెప్పడానికి దాదా ఎవరు.. పాక్‌ ధ్వజం.. గంగూలీకే జైకొట్టిన ఏసీసీ

   11-07-2020


విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

విండీస్ కెప్టెన్ జేసాన్ హోల్డర్ వీరవిహారం

   10-07-2020


గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

గారాల పట్టి సమైరాతో రోహిత్ టైం పాస్

   10-07-2020


ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

ఇంగ్లాండ్ vs వెస్టిండీస్ తొలి టెస్ట్.... వర్షం ఆటంకం

   09-07-2020


ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

ఆసియాకప్‌ 2020 వాయిదా.. విదేశాల్లో ఐపీఎల్ నిర్వహణ అసాధ్యం.. గంగూలీ

   09-07-2020


కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

కరోనా వేళ.. వెస్టిండీస్ టీం సాహసం

   08-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle