facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

ఢిల్లీ క్యాపిటల్స్ విజయఢంకా

13-04-201913-04-2019 08:16:08 IST
2019-04-13T02:46:08.236Z13-04-2019 2019-04-13T02:45:57.858Z - - 20-04-2019

ఢిల్లీ క్యాపిటల్స్ విజయఢంకా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయ 97 పరుగులతో తన జట్టును గెలిపించాడు. ఢిల్లీ 18.5ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద పృథ్వీ షా(14) కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత రస్సెల్ ఓవర్ లో శ్రేయస్(6) కూడా కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 57 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని శిఖర్ ధావన్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. ప్రారంభం నుండే దూకుడుగా ఆడిన ఈ జోడి మూడో వికెట్ కు 105 పరుగులు జోడించారు. జట్టును విజయానికి చేరువగా తీసుకు వెళ్లిన ఈ జోడి జట్టు స్కోరు 162 పరుగుల వద్ద రిషబ్ పంత్ వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు.

ఆ తరువాత ఇంగ్రామ్ క్రీజులో ఉన్న ధావన్ తో జత కలిశాడు. 12 బంతుల్లో 12 పరుగులు చేయవలసిన దశలో ధావన్ 95 పరుగులు మీద ఉన్నాడు. ధావన్ తన వ్యక్తిగత స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించగలిగాడు. ఇంగ్రామ్ వరుసగా 4,6 తో మ్యాచ్ ను ముగించాడు. దీంతో ధావన్ 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జట్టు విజయమే ముఖ్యమనే ఉద్దేశంతో ధావన్ కూడా నిరాశ లేకుండా మ్యాచ్ తరువాత ఎంతో ఉత్సాహంగా ఉండటం విశేషం. ఇంగ్రామ్(14) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  కోలకతా బౌలర్లలో ప్రశిద్ధ్ కృష్ణ, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా చెరో ఒక వికెట్ తీశారు. 

ముందుగా టాస్ ఓడిన కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్ తొలి బంతికి జో డెన్లే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టుకు గిల్, ఊతప్పల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 63 పరుగులు జోడించారు. అయితే రబాడా ఈ జోడీకి బ్రేక్ వేశాడు. రబడా వేసిన బంతికి ఊతప్ప(28) పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డ నితీష్ రాణా(11)ని మోరిస్ పెవిలియన్ దారి చూపాడు. 

ఓపెనర్ గా వచ్చిన శుభమాన్ గిల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు.ఈ దశలో కోలకతా వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద శుభమాన్ గిల్(65) ఔట్ కాగా 122 పరుగుల వద్ద దినేష్ కార్తీక్(2)ని రబడా పెవిలియన్ చేర్చాడు. 122 పరుగులకే కష్టాల్లో పడిన కోలకతాని మరోమారు ఆపద్బాంధవుడు ఆండ్రీ.రస్సెల్ ఆదుకున్నాడు. కేవలం 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో రస్సెల్ 45 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద బౌండరీ లైన్ వద్ద రబడా పట్టిన క్యాచ్ తో రస్సెల్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో బ్రెత్ వైట్(6) ఔటైనా పీయూష్ చావ్లా(14), కుల్దీప్ యాదవ్(2) జట్టు స్కోరును 178 పరుగులకు చేర్చారు. ఢిల్లీ బౌలర్లలో రబడా, మోరిస్, కీమో పాల్ రెండేసి వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ 1 వికెట్ తీశారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle