newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

డ్రా దిశగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ చివరి టెస్ట్..

03-12-201903-12-2019 08:16:19 IST
2019-12-03T02:46:19.799Z03-12-2019 2019-12-03T02:39:35.535Z - - 06-12-2019

 డ్రా దిశగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ చివరి టెస్ట్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 375 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో 476 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

జో రూట్(226) డబల్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ జట్టుకు 101 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది. ఆ తరువాత తమ రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన కివీస్ జట్టు ఆట ముగిసే సమయానికి 96/2 పరుగుల వద్ద నిలిచింది. ఇంకా కివీస్ జట్టు ఇంగ్లాండ్ జట్టు కన్నా 5 పరుగులు వెనుకబడి ఉంది. ఒకే రోజు ఆట మిగిలిఉన్న ఈ టెస్ట్ లో అద్భుతం జరిగితేనే ఫలితం రానుంది. 

ఓవర్ నైట్ స్కోరు  269/5 పరుగుల వద్ద తమ బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టును రూట్-పోప్ జోడి సమర్థవంతంగా ఎదురుకున్నారు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ లో ఎన్ని మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడటంతో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ జట్టు 379/5 పరుగుల వద్ద నిలిచింది.

రూట్(178), పోప్(48) పరుగుల వద్ద నిలిచాడు. లంచ్ విరామం తరువాత పోప్ 165 బంతులాడి హాఫ్ సెంచరీ చేశాడు. కెరీర్ లో పోప్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ జోడి దూకుడు పెంచడంతో ఇంగ్లాండ్ జట్టు 400 పరుగుల మార్క్ దాటింది. ఈ క్రమంలో రూట్ 412 బంతులాడి డబల్ సెంచరీ చేశాడు. డబల్ సెంచరీ తరువాత రూట్ వేగంగా ఆడాడు.

పోప్ చక్కని సహకారం అందించడంతో రూట్ జట్టు స్కోరును 455 పరుగులకు చేర్చాడు. ఈ దశలో పోప్(75) పెవిలియన్ చేరాడు. ఆరవ వికెట్ కు రూట్-పోప్ జోడి 193 పరుగులు జోడించారు. ఆ వెంటనే రూట్(226) కూడా పెవిలియన్ చేరడంతో 458 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లు నష్టపోయింది. వోక్స్(0), ఆర్చర్(8), బ్రాడ్(0) వరుసగా ఔట్ కావడంతో ఇంగ్లీష్ జట్టు 475 పరుగులకు ఆలౌట్ అయింది. 

 101 పరుగుల లోటుతో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ జట్టు రెండో ఓవర్ లోనే భారీ షాక్ తగిలింది. రావల్(0)ని శామ్ కరణ్ పెవిలియన్ చేర్చాడు. ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న లాదమ్(18) కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో 28 పరుగులకే 2 వికెట్లు నష్టపోయిన కివీస్ జట్టు  కష్టాల్లో పడింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన విలియమ్సన్, టైలర్ విలువైన భాగ్యస్వామాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టినా తమ అనుభవంతో విలియమ్సన్ - టైలర్ జోడి నిలకడ ప్రదర్శించారు. విజయవంతంగా ఈ జోడి మూడవ వికెట్ కు 68 పరుగులు జోడించడంతో కివీస్ జట్టు 2/96 పరుగులకు చేరింది. ఈ తరుణంలో అంపైర్లు నాలుగో రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle