newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డెబ్బై సెంచరీల కోహ్లీనే తప్పుపడతారా.. మండిపడ్డ పాక్ మాజీ కెప్టెన్

03-03-202003-03-2020 17:59:53 IST
Updated On 04-03-2020 13:05:28 ISTUpdated On 04-03-20202020-03-03T12:29:53.621Z03-03-2020 2020-03-03T12:29:51.088Z - 2020-03-04T07:35:28.336Z - 04-03-2020

డెబ్బై సెంచరీల కోహ్లీనే తప్పుపడతారా.. మండిపడ్డ పాక్ మాజీ కెప్టెన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
న్యూజిలాండ్ పర్యటనలో మూడు ఫార్మాట్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలం చెందటం అతడి కెరీర్‌కి మాయని మచ్చగా నిలిచిన నేపధ్యంలో అభిమానులు అప్పుడే నాయకత్వ మార్పు గురించి కూడా అవాకులు చెవాకులు పేలుతున్నారు. అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులు ఇలా అందరి నుంచి, అన్ని వైపుల నుంచి కోహ్లీపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజామామ్‌-ఉల్‌-హక్‌ మాత్రం అనూహ్యంగా కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. కోహ్లి ఆటతీరును తప్పుబడుతూ క్రీడాపండితులు, విమర్శలు చేసిన, చేస్తున్న విమర్శలకు యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఇంజామామ్‌ దీటుగా బదులిచ్చాడు. తన మాటల్లో చెప్పాలంటే..

'కోహ్లి ఆటతీరు, అతని టెక్నిక్‌పై పెదవి విరుస్తున్న వాళ్లకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు సాధించిన విరాట్‌ కోహ్లి టెక్నిక్‌పై విమర్శలు చేసే హక్కు మీకెవరికి లేదు. ప్రతి క్రికెటర్‌ ఏదో ఒక దశలో బ్యాడ్‌ఫేజ్‌లో ఉండడం సహజమే, దీనికే మీరంతా కోహ్లి ఆటను తప్పు బట్టడం సరికాదు. అయినా ఒక క్రికెటర్‌ తన కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన చేసినా ఒక్కోసారి విఫలమవుతూనే ఉంటారు. ఒకప్పుడు మా జట్టు ఆటగాడు మహ్మద్‌ యూసఫ్‌ ఇలాగే తన పూర్‌ ఫామ్‌ను కొనసాగించినప్పుడు అతని టెక్నిక్‌పై కూడా ఇలాగే విమర్శలు సంధించారు. అప్పుడు నేను యూసఫ్‌కు ఒకటే చెప్పా.. నీకు టెక్నిక్‌ అనేది లేకపోయి ఉంటే ఇన్ని పరుగులు ఇలా సాధించేవాడివా' అని ప్రశ్నించాను.

జట్టు మొత్తంగా విఫలం చెందిన చోట కెప్టెన్ ఒక్కడినే తప్పుపట్టడం సమంజసం కాదని ఇంజమామ్ విమర్శించాడు. కివీస్‌ పర్యటనలో భారత్‌ విఫలమైందంటే అది కోహ్లి ఒక్కడివల్ల మాత్రం కాదు. కోహ్లి పరుగులు సాధించలేదు నిజమే మరి జట్టులో మిగతావారు కూడా విఫలమయ్యారు.. దాని గురించి మాత్రం ఎవరు ఎందుకని మాట్లాడడం లేదు. కోహ్లి ప్రదర్శనపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతని టెక్నిక్‌పై కూడా విమర్శలు అవసరం లేదు. ఈ పర్యటనలో విఫలమైనా తిరిగి ఫుంజుకునే సత్తా కోహ్లిలో ఉందని నేను బలంగా నమ్ముతున్నా అని పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ హక్ టీమిండియా రథ సారథికి పూర్తి మద్దతునిచ్చాడు.  

'నా దృష్టిలో సయీద్‌ అన్వర్‌, సౌరవ్‌ గంగూలీ లాంటి ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఎన్నోసార్లు ఆకట్టుకున్నారు.. అయితే విఫలమైన ప్రతీసారి తిరిగి బౌన్స్‌బ్యాక్‌ అయ్యారు.. ఇప్పుడు కోహ్లి కూడా అలాగే మెరుగైన ప్రదర్శన ఇస్తాడని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కివీస్‌ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మొత్తం మూడు ఫార్మాట్లు కలిపి 11 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 218 పరుగులు మాత్రమే నమోదు చేశాడు. కాగా కివీస్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా, వన్డేలతో పాటు టెస్టు సిరీస్‌ను ఆతిథ్య జట్టు క్లీన్‌స్వీప్‌ చేయడం గమనార్హం. 

కాగా, కోహ్లీ ఘోరంగా విఫలం చెందిన న్యూజిలాండ్ పర్యటనలో ఏ ఇతర భారతీయ క్రికెటర్ కూడా కనీసం ఒక సెంచరీ సాధించలేకపోయారు. ప్రపంచంలోనే నంబర్ వన్ టెస్టు జట్టుగా ఉన్న టీమిండియా రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లో మూడింటిలో కనీసం 200 పరుగులు సాధించలేక చతికిలపడింది. ఈ రెండు టెస్టుల్లోనూ ఆతిథ్య జట్టు అయిన న్యూజిలాండ్ చక్కటి విజయాలు నమోదు చేసింది.

అందుకే పూర్తి సన్నద్ధతతో వచ్చిన జట్టు కూడా తనది కాని రోజు మైదానంలో చిత్తుగా ఓడిపోయే ఘటనలు సంభవిస్తాయని, ఇదంతా ఆటలో భాగమేనని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు. విమర్శకులు దాడి చేస్తున్నప్పటికీ కోహ్లీ తన టెక్నిక్‌ను మార్చుకోవలసిన పని లేదని, అదే టెక్నిక్ గత పదేళ్లకు పైగా అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీకి అద్బుతమైన గుర్తింపును తెచ్చిపెట్టిందని ఇంజమామ్ సమర్థించాడు. 

కోహ్లీకి నేను సూచించేదేమైనా ఉంది అంటే ఒక సీరీస్‌లో విఫలమైనంతమాత్రాన కొంపలు మునిగిపోవనే. ఆందోళన చెందవద్దు. ఈ గడ్డుపరిస్థితి త్వరలో తొలగిపోతుంది. అందుకే కోహ్లీ టెక్నిక్ వైఫల్యాల గురించి నేను అస్సలు మాట్లాడను. కోహ్లీ మానసికంగా అత్యంత దృఢమైన ఆటగాడు. అతడిని అనవసరంగా ఆడిపోసుకోవద్దు. అతడి ఆటతీరుపై నిందలు మోపవద్దు. ఒకసారి దెబ్బతిన్న పులి గోడకు కొట్టిన బంతిలా కోహ్లీ తిరిగొస్తాడు అని పాక్ క్రికెట్ మాజీ రథసారథి ఇంజమామ్ ఉల్ హక్ కోహ్లీని ఎత్తిపట్టాడు.

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   7 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   15 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle