newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

డెత్ బౌలింగ్‌లో మాస్టర్‌నే.. కానీ రైజర్సే పాఠం నేర్పింది.. భువనేశ్వర్ కుమార్

28-06-202028-06-2020 11:26:00 IST
2020-06-28T05:56:00.881Z28-06-2020 2020-06-28T05:55:58.336Z - - 11-07-2020

డెత్ బౌలింగ్‌లో మాస్టర్‌నే.. కానీ రైజర్సే పాఠం నేర్పింది.. భువనేశ్వర్ కుమార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కానీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కానీ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్ స్పెషలిస్టుగా ప్రపంచ ప్రసిద్ధి పొందాడంటే అతిశయోక్తి కాదు. ఒక రకంగా చెప్పాలంటే మ్యాచ్ మొదట్లో తర్వాత చివరి ఓవర్లలో బ్యాట్స్‌మన్‌లను కట్టడి చేసి ప్రత్యర్థి జట్టును వణికిస్తున్న మాస్టర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. చివరి ఓవర్లలో స్పష్టంమైన వ్యూహంతో టైట్‌గా బౌలింగ్ వేయడం అనే కళను సన్ రైజర్స్ జట్టే తనకు నేర్పిందని భువనేశ్వర్  అంగీకరించాడు.

ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేక్‌ అందించడంలో అతనికి అతనే సాటి. లీగ్‌లో సాగించిన ఈ తరహా ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్‌ చేయాలో కూడా నేర్చుకున్నానని భువనేశ్వర్‌ వ్యాఖ్యానించాడు. 

‘మొదటి నుంచి కూడా యార్కర్లు నా బలం. వాటిని బాగానే ఉపయోగించినా ఆ తర్వాత పట్టు చేజార్చుకునేవాడిని. అయితే సన్‌రైజర్స్‌తో ఆడటం మొదలు పెట్టాక నాలో మార్పు వచ్చింది. ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాల్సినప్పుడు, డెత్‌ ఓవర్లలో పరుగులు నిరోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎక్కువగా బౌలింగ్‌ చేశాను. దాని వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. తీవ్రమైన ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్‌ ఎలా చేయాలో నేర్చుకోగలిగాను’ అని అతను చెప్పాడు. 

2014 నుంచి సన్‌రైజర్స్‌ జట్టు తరఫున ఆడుతున్న భువీ 6 సీజన్లలో 86 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు పడగొట్టాడు. మాజీ కెప్టెన్‌ ధోని తరహాలోనే తాను కూడా నేర్చుకునే ప్రక్రియపైనే దృష్టి పెడతాను తప్ప ఫలితం గురించి ఆలోచించనని ఈ పేసర్‌ అన్నాడు. ఐపీఎల్‌లో కూడా అలా చేయడం వల్లే సానుకూల ఫలితాలు వచ్చాయని భువీ విశ్లేషించాడు.

డెత్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ చేతి కదలికలను నిశితంగా పరశీలించడం మొదలెట్టాను. ఇన్నింగ్స్ సాగుతుండగా బ్యాట్స్‌మన్ ఆటతీరును పరిశీలించమని టీమ్ మేధో బృందం ఒక వ్యూహాన్ని రూపొందించేది. ఆ ప్లాన్‌ను నేను అమలు పరచడంలో అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించేవాడిని. ఒక బ్యాట్స్‌మన్ బలహీనతలను ఎంత వేగంగా మనం పసిగడతామో అంత వేగంగా ఆ బలహీనమైన ప్రాంతంలో వారిపై దాడికి సిద్దపడవచ్చని భువనేశ్వర్ చెప్పారు

అయితే సన్ రైజర్స్‌లో ఆడుతున్నప్పుడు దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ నుంచి యార్కర్లు వేయడంలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో, చివరి ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌లను ఊరించి ఔట్ చేయడంలో లేక పరుగులు నిరోధించి ఒత్తిడి పెంచడంలో తాను ఎంతగానే నేర్చుకోగలిగానని భువీ చె్ప్పాడు.

డెత్ బౌలింగ్ సమయంలో తాను నేర్చుకున్న విషయాలన్నీ స్టైన్ సహకారం వల్లే సాధ్యమైందని భువీ తెలిపాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle