టేలర్, విలియమ్సన్ సెంచరీలు... సిరీస్ కైవసం
03-12-201903-12-2019 18:00:56 IST
2019-12-03T12:30:56.370Z03-12-2019 2019-12-03T12:30:54.017Z - - 06-12-2019

హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా ముగిసింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను కివీస్ 1-0 తో కైవసం చేసుకుంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 96/2తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కివీస్ 241/2 వద్ద ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ నిలిచింది. దీంతో మ్యాచ్ కొనసాగి ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (104 నాటౌట్), రాస్ టేలర్ (105 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కారు. అభేద్యమైన మూడో వికెట్‌కు వీరిద్దరూ 213 పరుగులు జోడించారు. అంతకుముందు తొలిఇన్నింగ్స్‌లో కివీస్ 375 పరుగులకు ఆలౌటైంది. లాథమ్ (105) సెంచరీ చేశాడు. బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్‌కు నాలుగు, క్రిస్ వోక్స్‌కు మూడు వికెట్లు దక్కాయి.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 476 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో 101 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. జో రూట్ డబుల్ సెంచరీ (226) చేయగా, రోరీ బర్న్స్ (101) శతక్కొట్టాడు. బౌలర్లలో నీల్ వాగ్నర్‌కు ఐదు వికెట్లు దక్కాయి. రూట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, వాగ్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. మౌంట్ మాంగనీలో జరిగిన తొలి టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 65 రన్స్ తేడాతో గెలుపొందింది.
ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్ రాస్ టేలర్....
సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన క్లబ్లో చేరిపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టేలర్(105 నాటౌట్) సెంచరీ సాధించాడు. ఫలితంగా టెస్టు క్రికెట్లో ఏడువేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం రాస్ టేలర్ 7,023 టెస్టు పరుగులతో ఉన్నాడు.
టెస్టు క్రికెట్లో ఏడువేల పరుగులు సాధించిన 51వ క్రికెటర్ టేలర్ కాగా, న్యూజిలాండ్ తరఫున ఆ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్. అంతకుముందు స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే కివీస్ తరఫున ఆ మార్కును చేరాడు. ఫ్లెమింగ్ తన కెరీర్లో 111 మ్యాచ్‌లకు గాను 189 ఇన్నింగ్స్‌లు ఆడి 7,172 పరుగులతో ఉన్నాడు. టేలర్ ఇప్పటి వరకు 96 టెస్టుల్లో 19 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీల సాయంతో 7023 పరుగులు సాధించాడు.



కోహ్లీని ఔట్ చేయడం కష్టం... విండీస్ కోచ్ సిమన్స్
8 hours ago

పదేళ్లుగా బీసీసీఐ నాకెలాంటి నిధులు ఇవ్వలేదు..
11 hours ago

అతనో బేబీ బౌలర్ ..
13 hours ago

బ్రియాన్ లారా రికార్డు పై వార్నర్ కన్ను..
17 hours ago

విరాట్ దే అగ్రస్థానం...
04-12-2019

ఆర్చర్ కుదురుకుంటాడు.. త్వరలో అదరగొడతాడు
04-12-2019

ఐపీఎల్ వేలానికి 971 మంది క్రికెటర్లు..
03-12-2019

కొత్త సంచలనం ఠాకూర్ తిలక్ వర్మ గురించి తెలుసా?
03-12-2019

ధోని ఎప్పుడు రిటైర్ అవుతాడో తెలుసు... మీకు చెప్పం : గంగూలీ
03-12-2019

డ్రా దిశగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ చివరి టెస్ట్..
03-12-2019
ఇంకా