newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

టీ20 సిరీస్ టీమిండియా సొంతం...

11-01-202011-01-2020 08:05:06 IST
2020-01-11T02:35:06.257Z11-01-2020 2020-01-11T02:35:03.335Z - - 18-01-2020

టీ20 సిరీస్ టీమిండియా సొంతం...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పుణే వేదికగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో ఘనవిజయాన్ని సాధించి టీమిండియా సిరీస్ ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 15.5 ఓవర్లు మాత్రమే ఆడి 123 పరుగులకు ఆలౌట్ అయింది.

దీంతో టీమిండియా 78 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో గెలుపొందింది. మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శార్దూల్ ఠాకూర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించంగా సిరీస్ మొత్తంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నవదీప్ షైనీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 

 ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. రాహుల్, ధావన్‌ పోటాపోటీగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా స్కోరు వాయు వేగంతో కదిలింది. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. కేఎల్‌ రాహుల్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) సాయంతో 54, శిఖర్‌ ధావన్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) 52 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 10.5 ఓవర్లలో 97 పరుగులకు చేరింది.

ఈ దశలో ధావన్‌(52) పెవిలియన్ చేరాడు. సంజు శాంసన్(6), శ్రేయాస్ అయ్యర్(4) తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో టీమిండియా 118 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది. ఆ వెంటనే రాహుల్(54)కూడా పెవిలియన్ చేరడంతో 122 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయింది. మనీష్ పాండేతో కలిసి కోహ్లీ భారీ షాట్లు ఆడాడు.

17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 26 పరుగులు చేసిన కోహ్లీ జట్టు స్కోరు 164 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. సుందర్(0) కూడా ఆ వెంటనే ఔట్ కావడంతో టీమిండియా ఆరవ వికెట్ నష్టపోయింది. చివరలో ఠాకూర్ సూపర్ షాట్లతో జట్టు స్కోరును 200 పరుగుల మార్క్ దాటించాడు. శార్దూల్ ఠాకూర్(22), మనీష్ పాండే(31) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు వరుసగా నాలుగు వికెట్లు నష్టపోయింది. గుణతిలక (1), అవిష్క (9),  ఒషాడా (2),  కుశాల్‌ పెరీరా (7) వికెట్లను నష్టపోవడంతో టీమిండియా 26 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మాథ్యూస్, ధనంజయ వీరిద్దరూ శ్రీలంక జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 68 పరుగులు జోడించడంతో లంక జట్టు 94/4 పరుగుల వద్ద నిలిచింది. ఈ దశలో మాథ్యూస్(31) పెవిలియన్ చేరడంతో 5 వికెట్ నష్టపోయింది.

ఆ తరువాత ధనంజయ 31 బంతుల్లోనే  అర్ధ సెంచరీ పూర్తి చేసినా అతనికి సహకారం అందించే ఆటగాళ్లు కరువయ్యారు. 57 పరుగులు చేసిన ధనంజయ జట్టు స్కోరు 122 పరుగుల వద్ద 9వ వికెట్ కు వెనుదిరిగాడు. ఆ వెంటనే మలింగా(0) పెవిలియన్ చేరడంతో లంక జట్టు 123 పరుగులకు ఆలౌట్ అయింది. షైనీ 3 మూడు వికెట్లు తీయగా ఠాకూర్, సుందర్ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle