newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీ20 వరల్డ్ కప్ వాయిదా.. 2023లో ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్

21-07-202021-07-2020 09:19:55 IST
Updated On 21-07-2020 10:49:51 ISTUpdated On 21-07-20202020-07-21T03:49:55.783Z21-07-2020 2020-07-21T03:49:43.511Z - 2020-07-21T05:19:51.284Z - 21-07-2020

టీ20 వరల్డ్ కప్ వాయిదా.. 2023లో ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా దెబ్బకు క్రికెట్ స్టేడియాలు, ఆట స్థలాలు బోసిపోతున్నాయి. కోట్లాదిమంది ప్రేక్షకులు ఆశగా ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ త్వరలో రాబోతోంది. క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా దెబ్బతో టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించనున్న టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. 

2021 అక్టోబర్‌‌లో దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే.. ఇదే సమయంలో క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ తెలిపింది. వరసగా మూడేళ్లలో మూడు మెగా టోర్నీలు నిర్వహించనుంది. అంతేకాదు 2023లో క్రికెట్ ప్రపంచకప్ భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఇంతకుముందు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే.. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో క్రికెట్ నిర్వహించే పరిస్థితి లేదని భావించిన ఐసీసీ దీన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

సోమవారం జరిగిన సమావేశంలో ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2021-23 మధ్య వరుసగా మూడేళ్లు మెగా టోర్నీలు నిర్వహించనుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2021 వచ్చే ఏడాది అక్టోబర్‌ మధ్య జరుగనుండగా.. నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఇక 2022లోనూ అక్టోబర్‌-నవంబర్‌లో మధ్య ఐసీసీ టీ20 టోర్నీ నిర్వహించనున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ను నవంబర్ 13న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఐసీసీ మెన్స్‌ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ - నవంబర్ నిర్వహించనుంది. ఈ మెగా టోర్నీ అక్టోబర్ - నవంబర్ మధ్య నిర్వహించనుంది ఐసీసీ. అదేవిధంగా ఫైనల్‌ మ్యాచ్‌ను నవంబర్ 26న నిర్వహించనున్నారు. పురుషులకు సంబంధించిన ఈ మూడు మెగా టోర్నీలతో పాటు 2021లో న్యూజిలాండ్‌లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది.

అభిమానులకు సురక్షితమైన రెండు టీ20 ప్రపంచకప్‌ను అందించాలని నిర్ణయించాం. ఇకపై జరిగే మూడు మెగా టోర్నీల విండో కోసం సభ్యులందరూ అంగీకరించారు. ఐసీసీ సీఈవో మను సాహ్నీ మాట్లాడుతూ వాయిదా ప్రక్రియలో ప్రభుత్వాలు, సభ్యులు, బ్రాడ్‌కాస్టర్లు, భాగస్వాములు, వైద్య సిబ్బంది అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఇదిలా వుంటే టీ20 ప్రపంచ కప్‌ వాయిదాతో ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమమైంది. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉంది. 

ఐపీఎల్ నిర్వహణ కోసం టీ20 ప్రపంచ కప్‌ను వాయిదా వేయాలని ఐసీసీని బీసీసీఐ ఒత్తిడి చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇండియాలో టోర్నీ నిర్వహించడం వీలు కాని పక్షంలో దుబాయ్‌లో నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారన్న వార్తతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో అక్కడికి తరలించనున్నారు. ముంబైలో నిర్వహించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని.. పరిస్థితులు మెరుగవ్వకపోతే దుబాయ్ తరలిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముంబైలో కరోనా తీవ్రత నేపథ్యంలో ముంబైలో జరిగే అవకాశాలు తక్కువగానే వున్నాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle