newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టీమిండియా ఆల్‌రౌండర్ ఇటీవల క్రికెటేతర అంశాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.

19-07-202019-07-2020 14:50:02 IST
Updated On 19-07-2020 16:49:52 ISTUpdated On 19-07-20202020-07-19T09:20:02.501Z19-07-2020 2020-07-19T09:19:56.857Z - 2020-07-19T11:19:52.420Z - 19-07-2020

టీమిండియా ఆల్‌రౌండర్ ఇటీవల క్రికెటేతర అంశాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల క్రికెటేతర అంశాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 1న సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌‌తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్ పాండ్యా.. మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

పెళ్లి కాకుండానే తండ్రి ఏంటి..? అని సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున సెటైర్ల వర్షం కురిపించారు. కానీ.. అవన్నీ ఏమీ పట్టించుకోని హార్దిక్.. తాజాగా తన డ్రీమ్ ఫ్యామిలీ ఫొటోని సోషల్ మీడియాలో వదిలాడు.

గర్భంతో ఉన్న నటాషా స్టాంకోవిచ్‌‌.. హార్దిక్ పాండ్య ఒడిలో పడుకుని ప్రేమగా అతనివైపు చూస్తుండగా.. హార్దిక్ మాత్రం పక్కనే ఉన్న తన పెంపుడు శునకాన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు.

ఈ ఫొటోని షేర్ చేస్తూ లవ్లీ డ్రీమ్ ఫ్యామిలీ అని అర్థం వచ్చేలా హార్దిక్ క్యాప్షన్ ఉంచాడు. హార్దిక్‌తో పాటు నటాషా స్టాంకోవిచ్‌‌‌కి కూడా పెంపుడు శునకాలంటే మహా ఇష్టం.

నటాషాతో ప్రేమ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ‘‘నేను ఎవరో అప్పటి వరకూ నటాషాకి తెలియదు. ఒక పార్టీలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను టోపీ, చైన్, వాచ్‌తో కనిపించడాన్ని చూసి.. ఈ వింత మనిషి ఎవరు..? ఎక్కడ నుంచి వచ్చాడు..? అనుకుందట. 

అయితే.. నేను తనతో మాట్లాడిన తర్వాతే.. ఒకరి గురించి మరొకరం తెలుసుకున్నాం. ఆ వెంటనే డేటింగ్, ఎంగేజ్‌మెంట్ జరిగిపోయాయి’’ అని హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.

2016, జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ఇప్పటి వరకూ 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో ఇప్పటికే 1,799 పరుగులు, 109 వికెట్లు పడగొట్టిన ఈ ఆల్‌రౌండర్.. స్లాగ్ ఓవర్లలో స్కోరు బోర్డుని అమాంతం పెంచడంలో సిద్ధహస్తుడు.

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   a day ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle