newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

టీమిండియాను ఆప‌త‌ర‌మా...!

10-01-202010-01-2020 13:32:51 IST
2020-01-10T08:02:51.844Z10-01-2020 2020-01-10T08:02:47.336Z - - 18-01-2020

టీమిండియాను ఆప‌త‌ర‌మా...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త సంవ‌త్స‌రంలో మొద‌టి సిరీస్ విజ‌యానికి టీమిండియా ఒక అడుగు దూరంలో ఉంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా నేడు శ్రీలంక‌తో ఆఖ‌రి టీ20 స‌మ‌రానికి సిద్ద‌మైంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ స‌మం చేయాల‌ని లంకేయులు బావిస్తుండ‌గా.. సిరీస్ విజ‌యంతో కొత్త సంవ‌త్స‌రంలో ఘ‌నంగా బోణీ కొట్టాల‌ని విరాట్ సేన ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య గువాహటిలో జ‌ర‌గాల్సిన మొద‌టి టీ20 వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు కాగా ఇండోర్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టిమిండియా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. పుణె  వేదిక‌గా ఇరు జ‌ట్ల మ‌ధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌నుంది. 

ఇదిలా ఉంటే మూడో టీ20కి  జ‌ట్టు కూర్పు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో విన్నింగ్‌ కాంబినేషన్‌ను కొనసాగించాలా లేక రిజర్వ్‌ బెంచ్‌లోని ఆటగాళ్లకు అవకాశమివ్వాలా అనే సందిగ్ధంలో పడింది టీమిండియా. గత మూడు సిరీస్‌లుగా రిజర్వ్‌ బెంచ్‌కి పరిమితమైన సంజు శాంసన్‌, మనీశ్ పాండేలకి కనీసం ఆఖరి టీ20లోనైనా అవకాశమివ్వడంపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ చర్చించినట్లు వెలుగులోకి వచ్చింది.

ఒక వేళ తుది జ‌ట్టులో సంజు శాంసన్, మనీశ్ పాండేలకి అవకాశం దొరికితే రిషబ్ పంత్, శివమ్ దూబే రిజర్వ్ బెంచ్‌కి పరిమితంకానున్నారు. అలాకాకుండా కీపర్‌గా రిషబ్ పంత్‌ని కొనసాగిస్తే అప్పుడు శ్రేయాస్ అయ్యర్‌కి రెస్ట్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సీనియర్లు లేని పేస్‌ దళంలో ఇటు శార్దుల్‌ ఠాకూర్, అటు నవ్‌దీప్‌సైనీ చక్కగా ఇమిడిపోయారు. భారత ఫాస్ట్‌ బౌలింగ్‌కు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. లంక జట్టులో ఎక్కువగా ఎడంచేతి ఆటగాళ్లుండటంతో కుల్దీప్, వాషింగ్టన్‌ సుందర్‌లనే కొనసాగించే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ మ్యాచ్‌లోనూ రవీంద్ర జడేజా, చహల్‌ ఇద్దరు డగౌట్‌కే పరిమితం కావాల్సివుంటుంది.

Image result for Team India"

ఇక లంకేయుల ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా అనుభవలేమి ఇటు బ్యాటింగ్‌ను, అటు బౌలింగ్‌ను వేధిస్తోంది. జట్టు మొత్తంలో అనుభవజ్ఞులు ఇద్దరే ఒకరు ఆల్‌రౌండర్‌ మాథ్యూస్‌ అయితే మ‌రొక‌రు కెప్టెన్, పేసర్‌ మలింగ. కుశాల్‌ పెరీరా, డిక్‌వెలా, ధనంజయలు బాగా ఆడగలరు. కానీ వారితో పోల్చి చూసుకునేంత అనుభవమైతే లేదు. అయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాథ్యూస్‌కు ఆడే అవకాశమివ్వలేదు. ఆల్‌రౌండర్‌ ఉడాన గాయం కూడా ఆ జట్టును మరింత కలవరపెడుతోంది. ఉడాన గాయంతో సీనియ‌ర్ మ‌థ్యాస్ కు చోటు ద‌క్క‌వ‌చ్చు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle