newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

టీం ఇండియా హెడ్ కోచ్ జీతమెంతో తెలిస్తే షాక్

09-09-201909-09-2019 18:39:12 IST
2019-09-09T13:09:12.813Z09-09-2019 2019-09-09T13:09:07.598Z - - 23-01-2020

టీం ఇండియా హెడ్ కోచ్ జీతమెంతో తెలిస్తే షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో అతి ఖరీదైన క్రీడ ఏది అంటే ఎవరైనా చటుక్కున క్రికెట్ అని చెబుతారు. భారీ పోటీ మధ్య టీమిండియా హెడ్ కోచ్‌గా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు రవిశాస్త్రి. ఆయనకు అంతా కలిసి వచ్చినట్టే వుంది. రవిశాస్త్రికి వేతనం భారీగా పెరిగింది.

గతంలో ఏడాదికి 8 కోట్ల రూపాయలు ఇస్తుండగా.. ప్రస్తుతం మరో 2 కోట్ల రూపాయలు పెంచి 10 కోట్లు అతనికి వేతనంగా అందించనున్నట్లు తెలిసింది. ఇటీవల రెండో సారి కోచ్ ఎంపిక సమయంలోనే తనకు 20 శాతానికి పైగా వేతనం పెంచాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆయన డిమాండ్‌కి అనుగుణంగా వేతనం పెరిగింది.

రవిశాస్త్రితో పాటు ఆయనకు సహాయక కోచ్‌లుగా ఎంపికైన వారికి కూడా జీతాలు పెరిగాయి. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లకు ఏడాదికి 3.5 కోట్లు, కొత్తగా బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికైన విక్రమ్ రాథోడ్‌కు 3 కోట్ల వరకు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. వీరికి ఈ జీతభత్యాలన్నీ సెప్టెంబర్ 1 నుంచే అమలులోనికి వస్తాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దీంతో వీరికి పండగే పండగ అన్నమాట. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle