newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

టీం ఇండియా వైట్ వాష్. కివీస్ తిరుగులేని విజయం

11-02-202011-02-2020 16:13:39 IST
Updated On 11-02-2020 16:14:36 ISTUpdated On 11-02-20202020-02-11T10:43:39.502Z11-02-2020 2020-02-11T10:43:33.551Z - 2020-02-11T10:44:36.312Z - 11-02-2020

టీం ఇండియా వైట్ వాష్. కివీస్ తిరుగులేని విజయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీం ఇండియాను చావుదెబ్బ కొట్టింది 1989 తర్వాత టీమిండియాను వైట్ వాష్ చేసిపారేసింది కివీస్. టీ20 ఓడిన నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా ఆడి వన్డేలను గెలుచుకుంది న్యూజిలాండ్. మౌంట్ మాంగనూయ్ లో భారత జట్టుకి పరాజయమే ఎదురైంది. మూడు మ్యాచ్ లను చేజార్చుకుంది. ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 

టీ20 సిరీస్‌ను 5-0తో ఊడ్చేసిన టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌ అయింది. అక్కడ గెలిచింది.. ఇక్కడ పోగొట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 296 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్ రాహుల్ 112, శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు చేశారు. 297 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 5 వికెట్లు మిగిలి వుండగానే 47.1 ఓవర్లలోనే విజయం సాధించింది. మార్టిన్‌ గప్తిల్‌ (66), హెన్రీ నికోల్స్‌ (80) అర్ధశతకాలు సాధించగా,  గ్రాండ్ హామ్ 58, టామ్ లేథమ్ 31 పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్ రాహుల్ కి బాగా గుర్తుండి పోతుంది. 21 ఏళ్ల తర్వాత ఆసియా బయట వన్డేల్లో సెంచరీ చేసిన భారత వికెట్‌ కీపర్‌గా రాహుల్ చరిత్ర సృష్టించాడు. 1999లో ఇంగ్లండ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ది గ్రేట్‌ వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సెంచరీ సాధించాడు.

దీంతోపాటు లోకేష్‌ రాహుల్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐదు లేక ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి సెంచరీ సాధించిన వికెట్‌ కీపర్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. మరోవైపు రాహుల్ కి వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించడం విశేషం. అద్భుత ఫామ్‌తో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు వికెట్‌ కీపింగ్‌లోనూ రాణిస్తున్న లోకేష్‌ రాహుల్‌పై టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించారు. తన క్లాస్‌ ఇన్నింగ్స్‌తో మరో గొప్ప ఇన్నింగ్స్‌ అంటూ అభినందించాడు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle