టీం ఇండియాకు షాక్... మళ్ళీ జరిమానా
03-02-202003-02-2020 17:38:31 IST
2020-02-03T12:08:31.210Z03-02-2020 2020-02-03T12:08:29.113Z - - 12-04-2021

ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ గెలుచుకున్న సత్తా చాటింది టీం ఇండియా. అయితే టీం ఇండియా ఆటగాళ్ళకు మాత్రం జరిమానాలు తప్పడం లేదు. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో ఆలస్యంగా బౌలింగ్ చేసినందుకు టీం ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40శాతం కోత పడింది. తాజాగా ఆదివారం జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్‌రేట్ కారణంగా మళ్లీ 20శాతం జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో భారత్ ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ క్రిస్ బ్రాడ్ జరిమానా విధిస్తూ నిర్ణయం ప్రకటించాడు. ఐదో టీ20లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ.. రెఫరీ విధించిన ఫైన్‌ను అంగీకరించక తప్పలేదు. హాఫ్ సెంచరీ పూర్తయ్యాక కండరాలు పట్టేయడంతో రోహిత్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కివీస్ లక్ష్య ఛేదనలో రోహిత్ మైదానంలో ఫీల్డింగ్‌కు రాకపోవడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ గడ్డపై టీమ్ఇండియా టీ20 సిరీస్ దక్కించుకోవడం ఇదే తొలిసారి. భారత్, కివీస్ మధ్య బుధవారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతోంది. కండరాలు పట్టేయడంతో న్యూజిలాండ్ పర్యటన నుంచి రోహిత్ ఔటవడం అభిమానులను కలవరపెడుతోంది. రోహిత్ పూర్తి ఫిట్‌గా లేడు. ఫిజియో సూచన మేరకు రోహిత్‌కు విశ్రాంతి అవసరం’ బీసీసీఐలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో రోహిత్ బాదుడు వచ్చే వన్డేల్లో కనిపించకపోవచ్చు.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
9 hours ago

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!
19 hours ago

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
19 hours ago

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
10-04-2021

కోహ్లీ జాగ్రత్త..!
10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
10-04-2021

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021
ఇంకా