newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టి20 ప్రపంచకప్‌ ఆశలు గల్లంతు.. చేతులెత్తేసిన ఆస్ట్రేలియా

17-06-202017-06-2020 10:50:18 IST
2020-06-17T05:20:18.517Z17-06-2020 2020-06-17T05:20:15.429Z - - 14-04-2021

టి20 ప్రపంచకప్‌ ఆశలు గల్లంతు.. చేతులెత్తేసిన ఆస్ట్రేలియా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ ప్రపంచం మొత్తం కరోనా వైరస్ ప్రభావంలో ఉంటున్నప్పుడు 16 దేశాల క్రికెట్ జట్లను దేశంలోని ఆహ్వానించే సాహసం చేయలేమని ఆస్ట్రేలియా చేతులెత్తేసింది.  కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న వేళ 16 జట్లను తీసుకొచ్చి టోర్నీని నిర్వహించలేమని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్‌ ఎర్ల్‌ ఎడింగ్స్‌ ప్రకటించారు. ఇందులో పాల్గొనే దేశాలన్నీ కూడా కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. అంతర్జాతీయ దారులన్నీ మూసుకొనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఏ ఇక నాన్చుడు ధోరణి తగదని... టోర్నీ కుదరదని చెప్పేసింది. 

మంగళవారం ఎడింగ్స్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘కోవిడ్‌ ప్రపంచమంతా పాకింది. పోటీ పడే దేశాల్లోనూ కరోనా ఉధృతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 16 జట్లను ఆస్ట్రేలియాకు రప్పించి, ప్రపంచకప్‌ నిర్వహించే అవకాశాలైతే లేవు. ఇది అత్యంత క్లిష్టం. అసాధ్యం కూడా! అయితే మా ప్రకటన రద్దు లేదంటే వాయిదానో కాదు. మాకున్న అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఐసీసీ ముందుంచాం. దీనిపై చర్చించి నిర్ణయించాల్సింది ఐసీసీనే’ అని తెలిపారు. 

ఇప్పుడు ప్రపంచంలో ఏ రంగం కరోనాను ఎదుర్కోలేకపోతోంది. అలాగే క్రీడా రంగం కూడా మహమ్మారి ముందు నిలువలేకపోతోంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీ సహా ఎన్నో ఆటలు, ఫార్ములాలు రద్దయిపోయాయి. కొన్నేమో వాయిదా పడ్డాయి. ఇప్పుడు టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ పరిస్థితి కూడా అక్కడికే వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గత రెండు సమావేశాల్లో తేల్చని టోర్నీ భవితవ్యాన్ని ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా తేల్చింది. ఇపుడున్న పరిస్థితుల్లో మెగా టోర్నీ అసాధ్యమని స్పష్టం చేసింది.

ఐసీసీ ఇంకా ప్రకటించనప్పటికీ నిర్వాహక దేశం ఆస్ట్రేలియా ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ అసాధ్యమని స్పష్టం చేసింది. రేపో మాపో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. గత వారం సమావేశమైన ఐసీసీ ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ టోర్నీపై ఏ నిర్ణయం తీసుకోకుండానే మీటింగ్‌ను ముగించింది. ఇంకొంత కాలం వేచిచూసే ధోరణిలో ఐసీసీ ఉంది. కానీ రాను రాను కోవిడ్‌ కోరలు చాస్తుందే కానీ తగ్గుముఖం పట్టడం లేదు.

ఆస్ట్రేలియాలో సెప్టెంబర్‌ ఆఖరు దాకా సరిహద్దుల్ని మూసేసింది. నిజానికి ఆసీస్‌లో వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కేసుల సంఖ్య ఇంకా 10 వేలను కూడా చేరుకోలేదు. సుమారు 7000 మంది వైరస్‌ బారిన పడగా... 6000 మంది కోలుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీని నిర్వహించి అనవసర ఇబ్బందుల్ని తలకెత్తుకోవడం ఎందుకని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావించింది. పొట్టి కప్‌ ఈ ఏడాది జరగకపోతే వచ్చే ఏడాది అనుమానమే. 2021లో బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా నిర్వహణ కష్టంగా మారొచ్చు. 2022లో భారత్‌లోనే  మెగా ఈవెంట్‌ జరుగుతుంది. కాబట్టి ఆసీస్‌ ఈవెంట్‌కు చోటుండదు.

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   3 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   8 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   14 hours ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   16 hours ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle