newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జూనియర్ క్రిస్ గేల్.. భారీ షాట్లు ఆడుతున్న చిన్నోడు

15-09-202015-09-2020 07:23:16 IST
2020-09-15T01:53:16.492Z15-09-2020 2020-09-15T01:53:13.078Z - - 19-04-2021

జూనియర్ క్రిస్ గేల్.. భారీ షాట్లు ఆడుతున్న చిన్నోడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత జట్టు మాజీ క్రికెటర్, కామెంట్రేటర్ ఆకాష్ చోప్రా తాజాగా ఓ వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోలో ఓ పిల్లాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అతడి వయసుకు.. ఆడుతున్న షాట్స్ కు ఏ మాత్రం సంబంధం లేదు. ప్లాస్టిక్ బాల్ ను తన చేతిలో ఉన్న బ్యాట్ తో బలంగా బాదుతున్నాడు. లెగ్ సైడ్, ఆఫ్ సైడ్ అంటూ తేడా లేకుండా చెలరేగిపోయాడు.

ఈ పిల్లోడు ఎంత మంచిగా షాట్స్ ఆడుతున్నాడు కదా అని ఆకాష్ చోప్రా కూడా ఆశ్చర్య పోయాడు. మెట్ల మీద నిలుచున్న ఆ పిల్లాడు.. బాల్ కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఓపెన్ స్టాన్స్ లో నిలబడిన ఆ పిల్లాడు.. ఫ్రీ ఆర్మ్స్ తో బంతి మీద ఎటువంటి జాలి చూపకుండా భారీ షాట్స్ ఆడాడు.  

ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ పిల్లాడు ఆడుతున్న షాట్స్ ను ప్రతి ఒక్కరూ పొగుడ్తూ ఉన్నారు. వెస్ట్ ఇండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ తో ఆ కుర్రాడిని పోల్చారు. అంతేకాదు 2007 టీ20 వరల్డ్ కప్ లో భారతజట్టు ఆటగాడు యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం గుర్తొచ్చిందని మరికొందరు తెలిపారు. 'ఆ పిల్లాడి బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది' అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా... 'జూనియర్ క్రిస్ గేల్ లా ఆ పిల్లాడు బ్యాటింగ్ చేశాడు' అని మరో యూజర్ చెప్పుకొచ్చాడు.

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆకాష్ చోప్రా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలలో ట్యాలెంట్ ఉన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటాడు. గత నెలలో ఓ అమ్మాయి మహేంద్ర సింగ్ ధోనికి చెందిన హెలీకాప్టర్ షాట్ ను ఆడిన వీడియోను గమనించవచ్చు.  

ఐపీఎల్ అతి దగ్గరలో ఉండడంతో ఆకాష్ చోప్రా తన విశ్లేషణలు ఇస్తూ వస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పిచ్ లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బాగా అనుకూలిస్తాయని చెబుతూ ఉన్నాడు. ఐపీఎల్ 2020 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు, ముంబై ఇండియన్స్ కు మధ్య సెప్టెంబర్ 19న మొదలుకానుంది. ఈసారైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సెప్టెంబర్ 21 తన మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle