newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం

02-06-202002-06-2020 11:55:01 IST
Updated On 02-06-2020 13:54:09 ISTUpdated On 02-06-20202020-06-02T06:25:01.318Z02-06-2020 2020-06-02T06:24:59.481Z - 2020-06-02T08:24:09.654Z - 02-06-2020

జాత్యహంకారంపై ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ ధ్వజం.. హోరెత్తిన క్రీడాప్రపంచం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికాలో ఓ నల్లజాతీయుడిని శ్వేతజాతి పోలీస్‌ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ఆరుసార్లు ఫార్ములావన్‌ (ఎఫ్‌1) ప్రపంచ చాంపియన్‌ అయిన లూయిస్‌ హామిల్టన్‌ గళం విప్పాడు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిపై పడగవిప్పిన జాతి వివక్షపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ నల్లజాతి రేసర్‌ అయిన హామిల్టన్‌ స్పందిస్తూ ఈ దురాగతంపై స్పందించరా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

‘ఈ కర్కశ హత్యపై నా క్రీడ నుంచి ఎవరు మాట్లాడరేంటి. బహుశా శ్వేతజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడ కాబట్టే పెదవి విప్పడం లేదనుకుంటా’ అని సోషల్‌ మీడియాలో తన ఆక్రోశాన్ని వెలిబుచ్చాడు. ఇంత ఘాతుకం జరిగిన తర్వాత కూడా నోరువిప్పకుండా సైలెంటుగా ఉంటున్న వారిని చూస్తూనే ఉన్నాను. మీలో కొందరు అతి పెద్ద స్టార్లు కానీ జార్జ్ ఫ్లాయడ్‌ను అమెరికన్ పోలీసులు దారుణంగా హత్యచేసిన తరవాత కూడా మీరు సైలెంటుగానే ఉన్నారు. నేను ఆడుతున్న ఫార్ములా వన్ పరిశ్రమలో ఏ ఒక్కరూ ఇంతవరకు ఈ క్రూర ఘటనకు నిరసన తెలిపిన పాపాన పోలేదు. ఎందుకంటే ఫార్ములా వన్ కూడా తెల్లజాతీయుల ఆధిపత్యం ఉన్న క్రీడే మరి. ఈ క్రీడలో నేనొక్కడినే నల్లజాతికి చెందినవాడిని అయినా నేను ఆ ఘటనకు వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాను అంటూ హామిల్టన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

ఇలా ఎందుకు జరిగిందో మీరు కూడా చూస్తుంటారని, దీనిపై ఏదైనా మాట్లాడతారని నేను భావించాను. కానీ ఈ విషాద సమయంలో మీరు మా వెంట లేరు. ఇప్పుడే మీరెలాంటివారో నేను చూస్తున్నాను. మీ స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నాను అంటూ క్రీడారంగంలోనూ పాతుకుపోయిన శ్వేతజాతి అహంకారాన్ని హామిల్టన్ దుయ్యబట్టాడు.

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలో లూటీ చేస్తున్న, భవనాలు తగులబెడుతున్న వారికి నేను మద్దతివ్వను. కానీ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి పక్షాన నేను నిలబడతాను. మన నాయకులు మారనంతవరకు ప్రపంచంలో శాంతి ఉండదు అంటూ హామిల్టన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

హామిల్టన్ ఇలా దుయ్యబట్టిన తర్వాతే ఫార్ములా వన్ క్రీడాకారులు, ఇతర క్రీడాకారులు కూడా స్పందించడం మొదలెట్టారు. హామిల్టన్ వ్యాఖ్య చేసిన వెనువెంటనే ఫార్ములావన్‌ క్రీడాలోకం స్పందించడం మొదలుపెట్టింది. వర్ణ వివక్ష హత్యపై నిరసించింది. రేసర్లతో పాటు మిగతా క్రీడలకు చెందిన స్టార్లు కూడా జరిగిన ఘోరంపై స్పందించారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాల్సిందేనని సోషల్‌ మీడియా వేదికపై నినదించారు.  

ఆఫ్రికన్‌–అమెరికన్‌ను శ్వేతజాతి పోలీసు కర్కశంగా చంపడం తనను చాలా బాధించిందని అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ అన్నాడు. ‘ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా చెబుతున్నా... చాలా బాధగా ఉంది. అలాగే కోపంగా కూడా ఉంది. జాతి వివక్ష హత్యపై అందరూ కదం తొక్కుతున్నారు. తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికైనా జాత్యహంకారం తొలగిపోవాలి. హింస సద్దుమణగాలి’ అని ఎన్‌బీఏ సూపర్‌స్టార్‌ జోర్డాన్‌ అన్నాడు.  

గతంలో కూడా మోటార్ రేసింగ్ క్రీడలో వైవిధ్యత లోపించడంపై హామిల్టన్ బహిరంగంగానే మాట్లాడాడు. నేను ఆడుతున్న క్రీడలో వైవిధ్యత అనేది కనీసమాత్రంగా కూడా లేదు. ఫార్ములా వన్‌లో తెల్లజాతీయులే కాకుండా నల్లజాతి, ఇతర జాతుల వారు కూడా చోటు సంపాదించేలా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను అని హామిల్టన్ గతంలో వ్యాఖ్యానించాడు.

జాతి సమానత్వానికి గూగుల్ మద్దతు.. సుందర్ పిచై ట్వీట్!

వాషింగ్టన్ జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని శ్వేత జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన నేపథ్యంలో అమెరికాలో నిరసనలు తారస్థాయికి చేరాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 25 నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి.. జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్.. జాతి సమానత్వానికి మద్దతు పలికింది. ఈ మేరకు గూగుల్ సీఈఓ సుందర్ పిచై.. ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. 

జాత్యహంకారానికి బలైపోయిన జార్జి ఫ్లాయిడ్ లాంటి వారిని స్మరించుకుంటూ, నల్లజాతియూలకు సంఘీభావంగా.. జాతి సమానత్వానికి మద్దతు తెలుపుతూ అమెరికాలో గూగుల్, యూట్యూబ్ హోం పేజీలను మార్చుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆవేదనతో జాతి సమానత్వం కోసం పోరాడేవారు ఒంటరి కాదని.. వారికి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle