జడేజా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్.. గౌతమ్ గంభీర్, కోహ్లీ ప్రశంసలు
26-06-202026-06-2020 10:36:23 IST
Updated On 27-06-2020 07:52:47 ISTUpdated On 27-06-20202020-06-26T05:06:23.565Z26-06-2020 2020-06-26T05:05:58.649Z - 2020-06-27T02:22:47.721Z - 27-06-2020

ప్రస్తుతం టీమిండియాలో, అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది బెస్ట్ ఫీల్డర్లు ఉన్నప్పటికీ జడేజానే అందరికంటే అత్యుత్తమని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. టీమిండియా అల్రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అతడే అత్యుత్తమ ఫీల్డర్ అని కితాబిచ్చారు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియాలో అందరు ఆటగాళ్లు ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో రాజీపడటం లేదని దీంతో ఫీల్డింగ్ ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయని తెలిపారు. అయితే ప్రస్తుతం టీమిండియాలో, అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో మంది బెస్ట్ ఫీల్డర్లు ఉన్నప్పటికీ జడేజానే అందరికంటే అత్యుత్తమని అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో రవీంద్ర జడేజానే అత్యుత్తమ ఫీల్డర్. అంతేకాకుండా అతడు జట్టుకు అవసరమైన నాణ్యమైన ఆల్‌రౌండర్. అవసరమైన సమయంలో బ్యాట్‌తో రాణించి మెప్పించగలడు.. బంతితో మాయ చేయగలడు.. అదేవిధంగా మెరుపు ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మనవైపు తిప్పగలడు. ఇక ఔట్‌ఫీల్డ్, కవర్స్‌లో అతడిని మించిన ఫీల్డర్ మరోకరు ఉండరు. గల్లీ, స్లిప్‌లో అతడు ఎక్కువగా ఫీల్డింగ్ చేయడు. అయినా బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని ఏ ఫీల్డింగ్ పొజిషన్ నుంచైనా వికెట్లపైకి నేరుగా విసరగల సామర్థ్యం అతడికి ఉంది. ఇక క్యాచ్‌లు అందుకోవడంలో అతడివి సేఫ్ హ్యాండ్స్. బంతి అతడి చేయి దాటి పక్కకుపోదు. బహుశా అందుకే అనుకుంటా జడేజా బెస్ట్ పీల్డర్ అని కీర్తింపబడుతున్నాడు’ అని గంభీర్ పేర్కొన్నారు. సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్.. అంగీకరించిన కోహ్లీ టీమిండియాలో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగిపోయే ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేరనే చెప్పాలి. ఇది ఇప్పటిమాట కాదు.. క్రికెట్లో భారత్ ఆట మొదలైనప్పటి నుంచి ఫీల్డింగ్ సమస్య అలానే ఉండేది. కొన్నిసార్లు చెత్త ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లను కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే భారత జట్టులో అడపాదడపా ఫీల్డింగ్‌లోనూ రాణించే ఆటగాళ్లు అరుదుగా కనిపిస్తారు. అందులో రాబిన్ సింగ్, మహ్మద్ కైఫ్, యువరాజ్ లాంటి ఆటగాళ్లు ఉండేవారు. ఈ దశాబ్దంలో మాత్రం ఫీల్డింగ్‌లో దశ మారిందనే చెప్పాలి. ఎంతోమంది యువ ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. వారిలో విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కనిపిస్తారు. అయితే వీరిలో ఎవరు బెస్ట్ ఫీల్డర్ అంటే మాత్రం చెప్పడం కొంచెం కష్టమే అవుతుంది. కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్ అంటూ కితాబిచ్చాడు. 'ఒకవేళ మీకు అవకాశమిస్తే డైరెక్ట్ త్రో ద్వారా స్టంప్స్‌ను ఎగురగొట్టడంలో విరాట్ లేదా జడేజాలో ఎవరిని ఏంచుకుంటారని ' స్టార్‌స్పోర్ట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించింది. దీనికి కోహ్లి స్పందిస్తూ.. ' ఇందులో ఏం సందేహం లేదు.. ప్రతీసారి జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్.. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం' అంటూ కామెంట్ చేశాడు.

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
12 minutes ago

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!
4 hours ago

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!
7 hours ago

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ
20 hours ago

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్
14-04-2021

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!
14-04-2021

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
14-04-2021

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి
13-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
12-04-2021

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను
12-04-2021
ఇంకా