newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జట్టులో నా స్థానమేంటో ధోనీ చక్కగా చూపించాడు.. యువీ వెల్లడి

07-08-202007-08-2020 06:45:26 IST
2020-08-07T01:15:26.921Z07-08-2020 2020-08-07T01:15:23.230Z - - 17-04-2021

జట్టులో నా స్థానమేంటో ధోనీ చక్కగా చూపించాడు.. యువీ వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జట్టు సభ్యుడిగా, కీలక ఆటగాడిగా, బౌలర్‌గా నాకు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఎంతో ప్రోత్సహాన్ని ఇచ్చారు కానీ పరిస్థితులు మారిన నేపథ్యంలో సెలక్టర్లు నన్ను కనీసం లెక్క లోకి తీసుకోలేదన్న విషయాన్ని మొదటగా నాకు తెలియజేసింది మాత్రం టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయేనని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశాడు. 

వాస్తవానికి ఎంఎస్ ధోనీ తన క్రికెట్ కెరీర్ గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకునేలా చేశాడని యువరాజ్ ‌సింగ్ పేర్కొన్నాడు. క్యాన్సర్‌ జయించిన తర్వాత క్రికెట్‌లో పునరాగమనం చేసినప్పుడు కెప్టెన్‌గా కోహ్లీ నాకు మద్దతుగా నిలిచాడు. కోహ్లీ ప్రోత్సాహంతోనే ఆటగాడిగా తిరిగి జట్టులోకి వచ్చాను కానీ సెలెక్టర్ల దృష్టిలో నా స్థానం ఎక్కడుందనేది ధోనీనే చూపించాడు. 

నిజమే.. ధోని నాకు వాస్తవ చిత్రం చూపించాడు. 2019 ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు నన్ను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని నాకు తెలిసేలా చేశాడు. వాస్తవానికి 2011 ప్రపంచకప్‌ వరకు ఎంఎస్ ధోనికి నాపై చాలా నమ్మకముండేది. జట్టులో నన్ను ఎప్పుడు ఒక ప్రధాన ఆటగాడిగానే గుర్తించాడు. స్వయంగా నాతో ఆ విషయం చెప్పాడు కూడా. కాని క్యాన్సర్‌ నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినప్పటికి అప్పటికే పరిస్థితులు మారిపోయాయి. 2015 ప్రపంచకప్‌ తర్వాత నాకు అవకాశాలు తగ్గిపోవడంతో అది నిరూపితమయింది అంటూ యూవీ చెప్పుకొచ్చాడు.

అప్పుడు నాకర్థమైంది ఏమిటంటే కెప్టెన్‌గా మీరు ప్రతి ఒక్క విషయాన్నీ సమర్థించలేరనే. ఎందుకంటే చిట్టచివరిగా జట్టు ఎలా ప్రదర్సన చేసిందన్నదే ముఖ్యం అని యువీ చెప్పాడు.

కేవలం 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యువరాజ్‌ సింగ్.. ధోని సారథ్యంలోని 2007 టీ20,  2011 వన్డే ప్రపంచకప్‌లు గెలుపొందిన భారత జట్టులో సభ్యుడు. ఈ రెండు ప్రపంచకప్‌ల విజయంలో యూవీ పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీమిండియా తరపున యూవీ 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లు ఆడాడు. కాగా యువరాజ్‌ గతేడాది జూన్‌ 10న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

ధోనీ రికార్డు బద్దలు కొట్టిన మోర్గాన్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ బద్దలు కొట్టాడు. ఈ మేరకు ఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితా ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా ధోనీ(211) ఉన్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్-ఐర్లాండ్ వన్‌డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా నేడు మూడో వన్‌డే మ్యాచ్ జరిగింది. 

మ్యాచ్‌కు ముందు ధోనీతో సమానంగా 211 సిక్స్‌లతో ఉన్న మోర్గాన్ మ్యాచ్ అనంతరం తొలి స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన తొలి సిక్స్ సాధించడం ద్వారా మోర్గాన్(212) ఈ ఫీట్ సాధించాడు. ఇదిలా ఉంటే ధోనీ తన 332 మ్యాచ్‌లలో 211 సిక్సులు కొట్టగా మోర్గాన్ మాత్రం కేవలం 163 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించాడు.

 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   14 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle