newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జట్టులో నంబర్ వన్ రన్నర్‌ని ఓడించలేనప్పడే నా రిటైర్మెంట్.. ధోనీ వ్యాఖ్య

10-08-202010-08-2020 07:08:25 IST
2020-08-10T01:38:25.880Z10-08-2020 2020-08-10T01:38:14.481Z - - 19-04-2021

జట్టులో నంబర్ వన్ రన్నర్‌ని ఓడించలేనప్పడే నా రిటైర్మెంట్.. ధోనీ వ్యాఖ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపు సంవత్సరం పైగా క్రికెట్‌కు, మైదానానికి దూరంగా ఉంటూ వస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ధోనీ వయసు 39 ఏళ్లు. ఈ నేపథ్యంలో ధోనీ కెరీర్ అయిపోయిందని, చివరి మ్యాచ్ కూడా ఆడేశాడని కొందరు మాజీ ఆటగాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే వీటన్నింటినీ ఏమాత్రం ధోనీ పట్టించుకోవడం లేదు. ఎలాగైనా మళ్లీ జట్టులోకి రావాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ధోనీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 

విరాట్ కోహ్లీ వివాహ సమయంలో ధోనీతో నేను మాట్లాడాను. అనుకోకుండా అతడి ఆటగురించి ప్రస్తావన వచ్చింది. జట్టులో అందరికంటే వేగంగా పరిగెత్తే ఆటగాడిని ఓడించగలిగినంతకాలం తాను ఫిట్‌గా ఉన్నట్లే భావిస్తానని ధోనీ అన్నాడు. అలా పరిగెత్తలేనప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలిపాడ’ని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్-2020లో ధోనీ బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఐపీఎల్‌లో ఎమ్మెస్ ధోనీ బ్యాట్స్‌మన్‌గా ఆడనుండటంలో పెద్ద తేడా ఏమీలేదు. పైగా యుఏఈలో వాతావరణ పరిస్థితులు ధోనీకి కచ్చితంగా అనుకూలిస్తాయి. ఇక్కడ బంతిని బలంగా బాదటం కంటే మెదడుకు పని పెట్టడమే కీలకం అవుతుందని  మంజ్రేకర్ చెప్పాడు. అయితే సంవత్సర కాలంగా క్రికెట్ ఆడని ధోనీ హెలికాప్టర్ షాట్లను సంధించే కంటే బంతిని నేలకేసి హిట్ చేయడానికే పరిమితం కావచ్చని భావిస్తున్నారు. అయితే మరోసారి మీరు ధోనీ హెలికాప్టర్ షాట్‌ విన్యాసాలను మీరు చూడవచ్చని ధోనీ చిరకాల టీమ్మేట్, సన్నిహిత మిత్రుడు సురేష్ రైనా పేర్కొన్నాడు.

ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టేశాడు.. సిద్ధమవుతున్న సీఎస్‌కే

దాదాపు సంవత్సరానికిపైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథ్యం వహించనున్న మహీ.. రాంచీలోని జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం (జేఎ్‌ససీఏ) స్టేడియంలో ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. గత జూలైలో వన్డే వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన సెమీఫైనలే ధోనీ ఆడిన చివరి మ్యాచ్‌. అప్పటినుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న అతడు ఐపీఎల్‌ నేపథ్యంలో మళ్లీ కదన రంగంలోకి దిగనున్నాడు. ‘ఇక్కడి అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్‌ను ధోనీ సందర్శించాడు. రెండురోజుల పాటు నెట్స్‌లో సాధన చేశాడు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా బౌలర్లు అందుబాటులో లేనందున బౌలింగ్‌ మెషీన్‌ను ఎదుర్కొంటూ ప్రాక్టీస్‌ చేశాడు’ అని జేఎ్‌ససీఏ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్‌ కోసం గత మార్చిలో చెన్నై జట్టు ఆటగాళ్లతో కలిసి ధోనీ కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాడు. అయితే కరోనా వైర్‌సతో ఐపీఎల్‌ వాయిదాపడడంతో రాంచీ వెళ్లిపోయాడు. అప్పటినుంచి అడపాదడపా సామాజిక మాధ్యమాల్లో మాత్రమే మహీ కనిపించాడు. కాగా..మహీ అంతర్జాతీయ కెరీర్‌పై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఐపీఎల్‌లో ప్రదర్శననుబట్టి కెరీర్‌పై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. 

ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టు ఐపీఎల్‌ సన్నాహకాలను వేగవంతం చేసింది. వచ్చే నెల 19న యూఏఈలో ప్రారంభమయ్యే టోర్నీకోసం ఆటగాళ్లు లగేజీ సర్దుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు లేకుండానే సీఎస్‌కే జట్టు యూఏఈ వెళుతోంది. ఐపీఎల్‌ ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌ఓపీ)ల ప్రకారం ప్రాక్టీస్‌, మ్యాచ్‌ల సమయంలో కుటుంబ సభ్యులు క్రికెటర్ల సమీపంలోకి వెళ్లడం నిషిద్ధం. దాంతో కుటుంబాలను తీసుకు వెళ్లకూడదనే చెన్నై జట్టు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. కనీసం టోర్నమెంట్‌ తొలి దశ వరకైనా కుటుంబాలను తీసుకువెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు జట్టు వర్గాలు వెల్లడించాయి. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle