newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జట్టులో ఎందుకుంటున్నామో.. ఎందుకు లేమో తెలీదు.. బీసీసీపై రైనా ధ్వజం

16-04-202016-04-2020 13:35:22 IST
Updated On 16-04-2020 13:46:45 ISTUpdated On 16-04-20202020-04-16T08:05:22.580Z16-04-2020 2020-04-16T08:05:18.009Z - 2020-04-16T08:16:45.139Z - 16-04-2020

జట్టులో ఎందుకుంటున్నామో.. ఎందుకు లేమో తెలీదు.. బీసీసీపై రైనా ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇటీవలికాలంలో బీసీసీఐ వ్యవహారాలను ప్రశ్నించని, వేలెత్తి చూపని వెటరన్ ఆటగాళ్లు పేర్లు చెప్పగలరా? చెప్పలేరనే సమాధానం వస్తుంది కాబోలు. ఎందుకంటే  భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేసిన సీనియర్ ఆటగాళ్లు అనేకమంది తమపై బీసీసీఐ చూపుతున్న నిర్లక్ష్యం పట్ల మండిపడుతూ వరుసగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు తప్పితే క్రికెట్ బోర్డు వ్యవహారం సజావుగా ఉందని ఒక్కరైనా చెప్పిన పాపాన పోలేదు. 

ఈ కోవలో టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా తాజాగా చేరిపోయాడు. అదీ కూడా ఆషామాషీగా కాదు.. సీనియర్ ఆటగాళ్ల పట్ల బీసీసీఐ సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై రైనా తీవ్రమైన అసంతృప్తిని ప్రదర్శించాడు.

సీనియర్‌ క్రికెటర్ల పట్ల సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్‌ ఆటగాళ్ల విషయంలో సెలెక్టర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించాడు. టీమిండియాలో చోటు దక్కాలంటే యో-యో ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో పాస్‌ కావడం తప్పని సరి. అందులో పాసైనా టీమ్‌లో చోటు ఎందుకు దక్కడం లేదో తెలీడం లేదని రైనా వాపోయాడు. 

‘ఈ రోజు అవకాశం వచ్చింది.. బాగా ఆడావు.. ఇంటికెళ్లావు. కానీ, తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాకపోతే.. ఎందుకు అనే కారణం అతడికి తెలియాలి. ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపండి. వాటిని సరిదిద్దుకుంటాం. ఏమీ చెప్పకపోతే ఎలా అర్ధం చేసుకోవాలి’ అని రైనా అన్నాడు.

వాస్తవంగా కూడా తాము చేస్తున్న తప్పుడు వ్యవహారాలకు పతాకశీర్షికల్లో కనిపించని భారత క్రికెట్ జాతీయ సెలెక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా మనకు కనిపించరు. ప్రధానంగా ఆటగాళ్ల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు ఎందరినో ఆవేదనకు గురి చేస్తోంది. రైనా కూడా దీనికి అతీతుడు కాదు. అందుకే ఆలస్యంగా అయినా సరే సందు చూసుకుని మరీ బీసీసీఐ సెలెక్టర్లపై వేలెత్తి చూపడానికి సాహసించాడు.

సీనియర్ ప్లేయర్లు భారత జాతీయ జట్టుకు శక్తిమేరకు సేవలందించారు. కానీ సురేష్ రైనా పట్ల మన సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరు, తనను పదే పదే అవమానిస్తున్న తీరు అమానుషం అని చెప్పక తప్పదు.

దాదాపు పదేళ్లు జట్టులో కొనసాగిన తర్వాత రైనాకు ఇప్పుడు జట్టులో తనకు ఏనాటికైనా స్థానం దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే తాజాగా ఆజ్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆవేదనను మొత్తంగా రైనా వెళ్లగక్కాడు. 

నువ్వు ఎంత పెద్ద ఆటగాడివైనా కావచ్చు. ఆరోజు మైదానంలో అద్భుత ప్రదర్శన ఇచ్చి ఉండవచ్చు. ఆ సంతోషంతోనే ఇంటికి వెళ్లి ఉండవచ్చు. కానీ ఆ మరుసటి దినం ఆటలోకి వచ్చేందుకు నీకు అవకాశం లేకపోతే నన్ను ఎందుకు నెట్ ప్రాక్టీసుకు పిలవలేదు అనే కారణం కూడా ఆ ఆటగాడికి తెలీకపోతే ఎలా అంటూ సెలెక్టర్ల వైఖరిని రైనా తీవ్రంగా తప్పు పట్టాడు.

ఏ ఆటగాడైనా సరిగా ఆడకపోతున్నట్లయితే అతడు ఎక్కడ తప్పు చేస్తున్నాడో ముందుగా ఎత్తిచూపాలి. అలా ఎవరూ సూచనలు అందించకుండా చూస్తున్నట్లయితే ఆ ఆటగాడిలో కచ్చితంగా సందేహం పుట్టుకొస్తుంది. లోపం ఎక్కడుందో అర్థం చేయించకపోతే అతడు ఎలా ఆటను మెరుగుపర్చుకుంటాడు అని రైనా ప్రశ్నించాడు.

2018 జూలైలో చివరి సారి మైదానంలో ఆడిన తర్వాత రైనాకు ఒక్కసారి కూడా బీసీసీఐ ఏ టోర్నీలోనూ చాన్స్ ఇవ్వలేదు. మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్ వంటి వారు సులభంగా జట్టులోకి వస్తున్నప్పుడు రైనా పరిస్థితి ఏంటే ఎవరైనా ఊహించుకోవలసిందే మరి.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే ఎన్నోసార్లు రైనాకు అవకాశమిచ్చి ప్రోత్సహించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అతడిని పట్టించుకున్న పాపాన పోలేదు. బీసీసీసీ కూడా రైనాపై పూర్తిగా శీతకన్ను వేసినట్లుంది. ఇక ఆటకు విరామం ప్రకటించక తప్పదని బోధపడినందుకే కాబోలు రైనా నేరుగా బీసీసీఐతోనే పెట్టుకున్నాడనిపిస్తోంది.

భారత పరిమిత ఓవర్ల జట్టులో ఎడమ చేతి బ్యాట్స్‌మన్ అయిన రైనా అత్యంత కీలకపాత్ర పోషించేవాడు. కానీ సెలెక్టర్లు తనపై విశ్వాసం చూపకపోవడంతో రైనా అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసిపోయినట్లే కనిపిస్తోంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle