facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

చేతులెత్తేసిన కోహ్లీసేన.. కంగారూలదే సిరీస్

14-03-201914-03-2019 07:14:10 IST
2019-03-14T01:44:10.730Z14-03-2019 2019-03-14T01:39:42.884Z - - 18-03-2019

చేతులెత్తేసిన కోహ్లీసేన.. కంగారూలదే సిరీస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ చేజేతులా పోగొట్టుకోవడం టీం ఇండియాకు అలవాటేనని మరోమారు రుజువైంది. చివరి వన్డేలో భారత్‌ ఓడిపోవడంతో సిరీస్‌ ఆస్ట్రేలియా వశమైంది. సరైన సమయంలో రాణించాల్సిన బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో భారత్‌ ఓటమి పాలైంది. ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 

భారత్ 273 పరుగుల లక్ష్యఛేదనలో కుప్పకూలింది. ఆసీస్ జట్టులో ఉస్మాన్‌ ఖవాజా సెంచరీతో  రెచ్చిపోయాడు. అలాగే హ్యాండ్స్‌కోంబ్ 52 పరుగులు చేశాడు. ఒక దశలో వికెట్‌ నష్టానికి 175 పరుగులు చేసింది.  350 పరుగులు ఈజీగా చేస్తుందని అంతా భావించారు. కానీ 272 పరుగులు మాత్రం చేసి పరువు నిలబెట్టుకుంది. భువనేశ్వర్‌కు 3, షమీ, జడేజాలకు రెండు వికెట్లు దక్కాయి. ఢిల్లీలో గెలిచి సిరీస్ సాధిద్దామన్న కోహ్లీ కల నెరవేరలేదు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle