newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చెలరేగిన ఇంగ్లండ్... ప్యాకప్ అంచున పాక్

15-08-202015-08-2020 13:06:25 IST
2020-08-15T07:36:25.251Z15-08-2020 2020-08-15T07:25:59.844Z - - 12-04-2021

చెలరేగిన ఇంగ్లండ్... ప్యాకప్ అంచున పాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాతావరణంలో మార్పులేదు.. పాకిస్థాన్ బ్యాటింగ్‌లో తేడా కనిపించలేదు. తొలిరోజులానే పడుతూ లేస్తూ.. సాగిన ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మన్ మరోసారి నిరాశపర్చారు. మహ్మద్ రిజ్వాన్(116 బంతుల్లో 5 ఫోర్లతో 60 బ్యాటింగ్) ఒంటరిపోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో ఓ మోస్తరు స్కోర్‌నే సాధించింది. 

మొత్తానికి ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు‌లో.. శుక్రవారం బ్యాడ్‌లైట్‌తో ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 9 వికెట్లకు 223 రన్స్ చేసింది.రిజ్వా‌న్‌తో పాటు నసీమ్ షా(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బాబర్ ఆజమ్(127 బంతుల్లో 3 ఫోర్లతో 47 హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. అండర్సన్, బ్రాడ్ చెరో 3 వికెట్లు తీశారు.ఉదయం వర్షం కారణంగా మ్యాచ్ 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. 126/5 ఓవర్‌నైట్‌ స్కో‌ర్‌తో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన పాక్‌ లంచ్ వరకు నిలకడగానే ఆడింది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్.. ఇంగ్లండ్ స్వింగ్ బౌలర్లను ఆచితూచి ఆడారు. ఎక్కువ డిఫెన్స్‌కు చూపడంతో ఈ సెషన్‌లో 29 పరుగులు మాత్రమే వచ్చాయి.

ఇక లంచ్ బ్రేక్‌ తర్వాత కొద్దిపేసటికే బాబర్‌ ఆజమ్‌ రూపంలో పేసర్‌ బ్రాడ్‌ పాక్‌ కీలక వికెట్‌ తీశాడు. గుడ్ లెంగ్త్ బంతిని ఆడే క్రమంలో బాబర్.. కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆరో వికెట్‌కు నమోదైన 38 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. అటు కీపర్‌ రిజ్వాన్‌ మాత్రం ఓపిగ్గా క్రీజులో నిలిచి ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కానీ మరో వైపు పాక్‌ యాసిర్‌ షా (5), షహీన్‌ అఫ్రీది (0) వికెట్లను కోల్పోయింది. 

176/8 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన వేళ.. మహ్మద్‌ అబ్బాస్‌ (2) కాస్త నిలబడడంతో రిజ్వాన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టు స్కోరును 200 దాటించాడు.ఈ సమయంలో వెలుతురు లేమితో ముందుగానే టీ బ్రేక్‌కు వెళ్లారు. ఇక చివరి సెషన్‌ ఆరంభమైన పది నిమిషాలకే మరోసారి వెలుతురు మందగించడంతో ఆటను నిలిపేశారు. అయితే ఆ లోపే అబ్బాస్‌ వికెట్‌ను కూడా పాక్‌ కోల్పోయింది. రెండు గంటలపాటు వేచి చూసినా సరైన వెలుతురు రాకపోవడంతో ఆటను రద్దు చేశారు. గురువారం 45.4 ఓవర్లు ఆట కొనసాగితే.. శుక్రవారం 40.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle