చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని పట్టించుకోలేదా..?
13-09-202013-09-2020 07:11:34 IST
2020-09-13T01:41:34.471Z13-09-2020 2020-09-13T01:41:31.466Z - - 19-04-2021

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. మహేంద్ర సింగ్ ధోని కారణంగా ఈ జట్టుకు మరింత ఫాలోయింగ్ వచ్చింది. ఐపీఎల్ మొదలైనప్పటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనినే కెప్టెన్ గా ఉన్నాడు. కానీ ఐపీఎల్ 2008లో మొదలైనప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దృష్టి ధోని కంటే భారత జట్టు డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మీదే ఉందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు బదరీనాథ్ వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కెప్టెన్‌గా మొదట ధోనీని అనుకోలేదట. వేలం పాటలో వీరేంద్ర సెహ్వాగ్‌ను దక్కించుకుని ఆయనకే కెప్టెన్సీ ఇవ్వాలని చెన్నై యాజమాన్యం ఆలోచన..! సెహ్వాగ్ ఐకాన్ ప్లేయర్ కావడంతో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఢిల్లీ డేర్డెవిల్స్కే ఆడతానని చెప్పాడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వేలం పాటలో ధోనిని రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంపాటలో ధోనిని దక్కించుకోడానికి ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కూడా అప్పట్లో బాగా ప్రయత్నించింది. కానీ చివరికి చెన్నైకే ధోని వెళ్ళాడు. 2007లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు సౌతాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గెలవడంతో సీఎస్కే యాజమాన్యం జట్టు పగ్గాలు ధోనీకే అప్పగించింది. ధోనీ సారథ్యంలో సీఎస్కే మూడు సార్లు(2010, 2011, 2018) ఐపీఎల్ టైటిళ్లు గెలవగా, రెండు సార్లు(2010, 2014) ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 విజేతగా నిలిచింది. ధోని కెప్టెన్ అవ్వడంతో చెన్నైకి భారీ ఫాలోయింగ్ సొంతమైంది. భారతజట్టు వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను ధోని సారథ్యంలోనే సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్ గా ధోని నిలవడంతో చెన్నై కూడా ఇప్పటి వరకూ కెప్టెన్ ను మార్చాలని యోచించలేదు. ధోని ఒకవేళ ఏదైనా మ్యాచ్ ఆడకపోతే ఆ మ్యాచ్ కు చిన్న తలా అంటూ చెన్నై అభిమానులు పిలిచే సురేష్ రైనా కెప్టెన్ గా వ్యవహరించే వాడు. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఐపీఎల్ లో మరో రెండు మూడు సంవత్సరాలు ఆడడం పక్కాగా కనిపిస్తోంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ ఎవరు అన్నది యాజమాన్యం ఆలోచించాల్సి ఉంది.

CSK vs RR : చెన్నై తో తలబడనున్న రాజస్థాన్.. గెలుపెవరిది?
an hour ago

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
9 hours ago

IPL 2021: వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూర్
20 hours ago

సన్ రైజర్స్.. మరో 'సారీ'..!
18-04-2021

MI vs SRH: కొండను ఢీకొట్టబోతున్న సన్ రైజర్స్
17-04-2021

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?
16-04-2021

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్
15-04-2021

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే
15-04-2021

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం
15-04-2021

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!
15-04-2021
ఇంకా