newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చివరి టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా.. టాప్‌ ర్యాంక్‌ పదిలం

09-09-202009-09-2020 13:03:13 IST
Updated On 09-09-2020 13:03:09 ISTUpdated On 09-09-20202020-09-09T07:33:13.961Z09-09-2020 2020-09-09T07:31:20.076Z - 2020-09-09T07:33:09.896Z - 09-09-2020

చివరి టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా.. టాప్‌ ర్యాంక్‌ పదిలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో గెలిచి ఆస్ట్రేలియా పరువు దక్కించుకుంది. తొలి రెండు మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌ గెలవడంతో.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో ఆసీస్‌ కోల్పోయింది ఈ విజయంతో ఆసీస్‌.. ఇంగ్లాండ్‌ పర్యటనలో మొదటి గెలుపును రుచి చూసింది. అలాగే టీ20 ఫార్మాట్‌లో ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని అందుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ హీరో బట్లర్‌ చేతి వేలి గాయంతో దూరం అవ్వడంతో.. ఈ మ్యాచ్‌లో టామ్‌ బాంటన్, జానీ బెయిర్‌ స్టో లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే.. బాంటన్‌(2) జట్టు స్కోరు 4 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

ఈ దశలో మరో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో (55; 44 బంతుల్లో 3ఫోర్లు, 3 సిక్సర్లు)కి మలన్‌ (21; 18 బంతుల్లో 3ఫోర్లు) జత కలిశాడు. వీరిద్దరు వీలు చిక్కినప్పుడెల్లా బంతిని బౌండరీ దాటిస్తూ జట్టు స్కోర్‌ వేగాన్ని పెంచారు. జట్టు స్కోర్‌ 53 పరుగుల వద్ద మలన్ ఔట్‌ కాగా.. ఆతరువాత వచ్చిన సామ్‌ బిల్డింగ్స్‌ బిల్లింగ్స్(4) దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గైర్హాజరీతో తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న మోయిన్ అలీ(23; 21 బంతుల్లో 2పోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలోనే బెయిర్ స్టో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అనంతరం అగర్ బౌలింగ్‌లో రిట్నర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మరికొద్ది సేపటికే మోయిన్ అలీ కూడా పెవిలియన్‌ చేరాడు. చివర్లో డెన్లీ(29; 19 బంతుల్లో 4 పోర్లు) ధాటిగా బ్యాటింగ్‌ చేయడంతో.. ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 2 వికెట్లు తీయగా.. స్టార్క్‌, హెజిల్‌వుడ్‌, రిచర్డ్‌సన్‌, ఆగర్‌ తలా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 146 పరుగుల లక్ష్య చేధించడానికి బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ఫించ్‌, మ్యాథ్యూ వేడ్ శుభారంభాన్ని ఇచ్చారు. ఆర్చర్‌ వేసిన మొదటి ఓవర్‌లోనే 16 పరుగులు రాబట్టారు. వేడ్‌ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద వెనుదిరగగా.. స్టోయినిస్‌(26; 18బంతుల్లో 5పోర్లు) సాయంతక్ష ఫించ్‌(39; 26 బంతుల్లో 4పోర్లు, 1 సిక్సర్‌) తన దూకుడు కొనసాగించాడు. విధ్వంసకర ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ (6), స్టీవ్‌ స్మిత్ (3) తక్కువ పరుగులకే ఔటైన మిచెల్ మార్ష్ (39 నాటౌట్‌; 36బంతుల్లో 2 పోర్లు, 1 సిక్సర్‌), మార్కస్ స్టోయినిస్ (26; 18 బంతుల్లో 5 పోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీయగా.. టామ్ కరన్, మార్క్ వుడ్ తలో వికెట్ తీశారు. మిచెల్‌ మార్ష్‌కు ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించగా.. ఇంగ్లాండ్‌ ఆటగాడు జోస్ బట్లర్‌కు ప్లేయర్‌ ఆప్‌ది సిరీస్‌ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ మాంచెస్టర్ వేదికగా ప్రారంభంకానుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle