newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చావుకు దగ్గరైనప్పుడు ఆదుకోవడం వల్లే మీ ముందున్నా.. షమీ ఉద్వేగం

22-06-202022-06-2020 07:36:51 IST
Updated On 22-06-2020 08:01:19 ISTUpdated On 22-06-20202020-06-22T02:06:51.081Z22-06-2020 2020-06-22T02:06:47.916Z - 2020-06-22T02:31:19.209Z - 22-06-2020

చావుకు దగ్గరైనప్పుడు ఆదుకోవడం వల్లే మీ ముందున్నా.. షమీ ఉద్వేగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాను ఆత్మహత్య చేసుకోవాలన్న సందర్భాలు చాలానే ఉన్నాయని టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ తాజాగా తెలిపాడు. ఇటీవల బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో షమీ ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని చెప్పుకొచ్చాడు. పేలవమైన ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోవడం మొదలుకొని ఫిక్సింగ్‌ ఆరోపణలు చుట్టిముట్టిన సమయంలో చావే శరణ్యమని అనిపించిందన్నాడు. కానీ ఆ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు అండగా ఉండటంతో దాని నుంచి బయటపడ్డానన్నాడు. అదే సమయంలో భారత క్రికెట్‌లోని తన సహచర క్రికెటర్ల మద్దతు కూడా వెన్నంటే ఉండటం కూడా ఆ చెడు ఆలోచనల నుంచి బయటకు రావడానికి కారణమన్నాడు.

‘డిప్రెషన్‌ అనేది చాలా పెద్ద సమస్య. అందుకు తగిన కౌన్సిలింగ్‌ తీసుకోవడం లేదా ఆ బాధను మనకు దగ్గర వాళ్లతో పంచుకుంటే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. ఆత్మహత్య ఒక్కటే శరణ్యమని భావించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సమయంలో నా కుటుంబం అండగా నిలబడింది. నన్ను  చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అలా ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడి పోరాటం చేయాల్సిందే అనే భావనకు వచ్చా.  నేను ఎప్పుడూ ఒంటరి కాదనే భరోసా నా కుటుంబ సభ్యులు నాకిచ్చారు. అలానే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సహచర క్రికెటర్ల కూడా నాకు అండగా నిలిచారు. ఎవరైనా మానసిక సమస్యతో సతమతమైతే దాన్ని మీలోనే ఉంచుకోకండి. మన మంచిని కోరుకునే వాళ్లతో పంచుకోండి. సమాధానం దొరుకుతుంది. అంతేకానీ చావు ఒక్కటే మార్గం కాదు. నా విషయంలో జట్టు నుంచి వచ్చిన సహకారం ఎప్పటికీ మరవలేనిది. నేను నిజంగా అదృష్టవంతుడ్నే’ అని షమీ తెలిపాడు.

ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో షమీ తన ఫామ్‌ను చాటుకుని నిలబడ్డాడు. సుదీర్ఘ కాలం జట్టుకు దూరమైన షమీ అంతే వేగంగా పుంజుకున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టులో ప్రధాన పేసర్‌గా షమీ కొనసాగుతున్నాడు. ఒకవైపు షమీపై భార్య లేనిపోని ఆరోపణలు చేయడం కూడా అతని మానసిక స్థైర్యాన్ని కుంగదీసింది. కాగా, వాటిని అధిగమించిన షమీ.. ఆత్మహత్య ఆలోచనలు అనేవి మంచివి కావన్నాడు. మనకు ఏమైనా బాధనిపిస్తే షేర్‌ చేసుకుంటే ఎంతో కొంత తీరుతుందని పేర్కొన్నాడు. 

గత కొంత కాలంగా భారత జట్టు టెస్టు విజయాల్లో పేస్‌ బౌలర్‌ షమీ కూడా కీలకపాత్ర పోషించాడు. అయితే సహచర పేసర్లతో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో కంటే షమీ రెండో ఇన్నింగ్స్‌ రికార్డు చాలా బాగుంది. తన కెరీర్‌లో పడగొట్టిన మొత్తం 180 వికెట్లలో షమీ తొలి ఇన్నింగ్స్‌లో 32.50 సగటుతో 92 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేసిన సందర్భంలో కేవలం 21.98 సగటుతో 88 వికెట్లు తీశాడు.  మ్యాచ్‌ సాగినకొద్దీ అతని బౌలింగ్‌లో పదును పెరిగినట్లు కనిపిస్తుంది. 

దీనిపై షమీ మాట్లాడుతూ... ‘ఇతర బౌలర్లు అలసిపోయిన సందర్భంలో బాధ్యత తీసుకుంటాను. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోతాను. జట్టులో ప్రతీ ఒక్కరు అప్పటికే కనీసం మూడు రోజులు మైదానంలో గడుపుతారు. డీజిల్‌ ఇంజిన్లతో పోలిస్తే పెట్రోల్‌ ఇంజిన్‌ తొందరగా పికప్‌ అందుకుంటుంది. నాదైన సమయం కోసం వేచి చూస్తాను. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ దానికి మంచి ఉదాహరణ. పిచ్‌లో జీవం, బౌన్స్‌ లేకున్నా అలాంటి చోట రెండో ఇన్నింగ్స్‌లో నేను ఐదు వికెట్లు తీశాను’ అని షమీ విశ్లేషించాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle