newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

చాపెల్ వ‌ల్ల కాదు... మేనేజ్ మెంట్ స‌హ‌కారం లేక‌నే...

10-01-202010-01-2020 09:49:24 IST
2020-01-10T04:19:24.382Z10-01-2020 2020-01-10T04:19:21.007Z - - 18-01-2020

చాపెల్ వ‌ల్ల కాదు... మేనేజ్ మెంట్ స‌హ‌కారం లేక‌నే...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్‌లో పేస్ ఆల్‌రౌండర్‌గా ఇర్ఫాన్ పఠాన్ అప్పట్లో ఓ వెలుగు వెలిగాడు. కపిల్ దేవ్ తర్వాత అంతటి ఆల్‌రౌండర్ దొరికాడని అతని అరంగేట్ర రోజుల్లో చెప్పుకునేవారు. అయితే అప్పట్లో భారత కోచ్‌గా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల పఠాన్ కెరీర్ దెబ్బతిందని అప్పట్లో భావించేవారు. ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 

జట్టుకు అవసరమైన సమయంలో ఏ పాత్ర పోషించడానికైనా ఈ లెఫ్టార్మ్‌ బౌలర్‌ సిద్దంగా ఉండేవాడని కితాబిచ్చాడు. అంతేకాకుండా పఠాన్‌ అత్యంత ధైర్యవంతుడని అదేవిధంగా నిస్వార్థపరుడని ప్రశంసించాడు. ‘ఇర్ఫాన్‌ పఠాన్‌ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో శతకానికి దగ్గరగా వచ్చి మంచి ఆల్‌రౌండర్‌ అని నిరూపించుకున్నాడు. ఇక బౌలింగ్‌లో వన్డేల్లో విశేషంగా రాణించాడు. టెస్టుల్లో కూడా ఆకట్టుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ వికెట్లు పడగొట్టే విధానం నాకు బాగా నచ్చేది. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ సాధించడం ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇన్నింగ్స్‌లలో నాకు బాగా నచ్చింది’అని చాపెల్‌ పేర్కొన్నాడు. 

Image result for Irfan Pathan Comments on Team India Management, greg cha[pell"

ఇక పఠాన్‌ ఆట గాడితప్పిందని చాపెల్‌ అడ్డు అదుపు లేని ప్రయోగాలే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్‌గా తీర్చిద్దిడంలో భాగంగా పఠాన్‌ చేత ఎక్కువగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేపించడంతో బౌలింగ్‌ లయ దెబ్బతిన్నదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటన్నింటిని పఠాన్‌ తీవ్రంగా ఖండించాడు. తను జట్టు నుంచి దూరం కావడం వెనుక చాపెల్ నిర్ణయాలు కారణం కాదని వేరే ఉన్నాయని తాజాగా మనసు విప్పాడు. 2003లో టీమిండియాలో అరంగేట్రం చేసిన పఠాన్..2012లో చివరి మ్యాచ్ ఆడాడు. పాకిస్థాన్ గడ్డపై ఆ జట్టుపై టెస్టుల్లో హ్యాట్రిక్, 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాంటి ఘనతలు తన సొంతం.

అయితే తర్వాతి కాలంలో కొన్ని కారణాల వల్ల తను టీమిండియాలోకి ఎంపిక కాలేకపోయాడు. పించ్ హిట్టర్‌గా పఠాన్‌ను చాపెల్ పంపించడం అతని కెరీర్‌ను దెబ్బతీసిందని పేర్కొంటారు. ప్రారంభంలో బౌలింగ్‌లో ఉన్నటువాంటి వాడిని కొనసాగించలేకపోయాడు. అయితే తాజాగా తను రీ ఎంట్రీ కాలేకపోవడంపై మనసు విప్పాడు. తను స్వింగ్ బౌలింగ్ చక్కగా చేస్తానని, గాయాలు, టీమ్ మేనేజ్మెంట్ సహకారలేమితో తన కెరీర్ ముగిసిందని వ్యాఖ్యానించాడు.‘చాపెల్‌పై ఆరోపణలు చేసిన తప్పిదాలను కవర్ చేసుకోవడం కోసమే చెబుతారు. నేనప్పుడు స్వింగ్ కోల్పోయానన్నది అబద్ధం.

Image result for Irfan Pathan batting"

అయితే పది ఓవర్ల తర్వాత బంతిని చేతికిస్తే స్వింగ్ రాదు కదా. అదే పొరపాటు దొర్లింది. అప్పట్లో నన్ను ఫస్ట్ బౌలింగ్ చేంజ్‌గా ఉపయోగించుకునేవారు’ అని పఠాన్ వ్యాఖ్యానించాడు. ఇక నా ఆటతీరు విషయానికొస్తే, అప్పట్లో ట్రీట్‌మెంట్ వేరేగా ఉండేది. తొలి బౌలింగ్ మార్పుగా నాకు బంతి ఇచ్చేవారు. ఆరంభ బౌలర్లలో బంతినివ్వకుండా చేసిన ఈ మార్పు వికటించింది. ఇక 2008 శ్రీలంకతో మ్యాచ్ గెలిచాక నన్ను జట్టు నుంచి తప్పించారు. ఎలాంటి కారణం లేకుండా జట్టు నుంచి తప్పించడమేమిటో నాకు అర్ధం కాలేదు’ అని పఠాన్ వ్యాఖ్యానించాడు.

2006 కరాచీ టెస్టు పఠాన్ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఆ టెస్టు తొలి ఓవర్లోనే సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్‌ను పెవిలియన్‌కు పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. మరోవైపు 2007 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ పాక్‌పై మూడు వికెట్లు తీసి సత్తాచాటాడు.అయితే తర్వాతి కాలంలో తను బౌలింగ్ శైలిని మార్చుకోవడం, బ్యాటింగ్‌పై ఫోకస్ పెంచి రెంటికి చెడ్డ రేవటిలా మారి జట్టులో చోటు కోల్పోయాడని ఇప్పటివరకు వాదన ఉంది. అయితే గాయాలు, టీమ్ మేనేజ్‌మెంట్ సహకారం లేకనే తన కెరీర్ పతనమయ్యిందని తాజాగా పఠాన్ వ్యాఖ్యానించాడు. ఇక 2012లో చివరి మ్యాచ్ ఆడిన పఠాన్.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు (5/61) తీయడం విశేషం.

Image result for Irfan Pathan Comments on Team India Management"


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle