newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

గురుగ్రామ్‌పై మిడతల దండు దాడి.. సెహ్వాగ్ ఇంటిపై మిడతల మందలు

29-06-202029-06-2020 07:35:54 IST
2020-06-29T02:05:54.746Z29-06-2020 2020-06-29T02:05:51.426Z - - 11-07-2020

గురుగ్రామ్‌పై మిడతల దండు దాడి.. సెహ్వాగ్ ఇంటిపై మిడతల మందలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాహుబలి సినిమా తొలిభాగంలో కాలకేయుల భీకరమైన పరుగును చూసిన వారికి శనివారం గురుగ్రామ్‌లో అవే దృశ్యాలు మళ్లీ కనిపించాయి. బాహుబలి సినిమాలో కాలకేయుల వేగం, వారి రాక్షస దాడి సినీ ప్రేక్షకులను నోళ్లు తెరుచుకునేలా చేసి భయపెట్టాయి. సరిగ్గా అదే రకమైన అనుభూతి శనివారం ఢిల్లీ గురుగ్రామ్ సరహద్దు ప్రాంతాల ప్రజలకు కలిగింది. అది మిడతల దండు కావడం మరీ విశేషం.

ఒకటా.. రెండా.. లక్షా పదిలక్షలా.. కాదు.. కోట్ల సంఖ్యలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించిన రాకాసిమిడతల గుంపులు ఢిల్లీ–గురుగ్రామ్‌ సరిహద్దు దాకా చేరాయి. పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనమైన మిడతల దండు శనివారం ఉదయం 11.30 గంటలకు గురుగ్రామ్‌లోకి ప్రవేశించిందని హరియాణా వ్యవసాయ శాఖలో మిడతల హెచ్చరిక విభాగం అధికారి కేఎల్‌ గుర్జార్‌ తెలిపారు. ప్రస్తుతం హరియాణాలోని పాల్వాల్‌ వైపు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. 

పంటలను భోంచేసే ఈ మిడతలు ఈ ఏడాది మే నెలలో ఆఫ్రికా ఎడారుల నుంచి భారత్‌లోకి అడుగుపెట్టాయి. తొలుత రాజస్తాన్‌లో, తర్వాత పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించాయి.  

మిడతల దండు ఢిల్లీ సరిహద్దు దాకా రావడంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో శనివారం హైఅలర్ట్‌ ప్రకటించింది. మిడతలు దండెత్తకుండా చెట్లపై రసాయనాలు, పురుగు మందులు చల్లాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వేప ఆకులను మండిస్తే పొగకు మిడతలు పారిపోతాయని వెల్లడించింది.

సెహ్వాగ్‌ ఇంటిపై మిడతల దాడి

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇంటిపై మిడతలు దాడి చేశాయి. గురుగ్రామ్‌లో ఉన్న అతని ఇంటి పరిసరాల్లోకి వేలాదిగా శనివారం మిడతలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సెహ్వాగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘మా ఇంటిపై మిడతల దండు దాడి’ అని వీరూ ఆ వీడియోకు కామెంట్‌ పెట్టాడు. 

రాజస్థాన్‌ నుంచి దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు.. ఇప్పుడు దేశ రాజధానిలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మిడతల దాడి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి కిటికీలను తెరవరాదని గురుగ్రామ్‌ వాసులను అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle