newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గాడ్ ఆఫ్ క్రికెటే కాదు.. మ్యాన్ ఆఫ్ టెక్నిక్ కూడా సచినేనట

11-04-202011-04-2020 16:10:31 IST
Updated On 11-04-2020 16:20:00 ISTUpdated On 11-04-20202020-04-11T10:40:31.033Z11-04-2020 2020-04-11T10:40:28.481Z - 2020-04-11T10:50:00.007Z - 11-04-2020

గాడ్ ఆఫ్ క్రికెటే కాదు.. మ్యాన్ ఆఫ్ టెక్నిక్ కూడా సచినేనట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సాంకేతిక ప్రతిభతో క్రికెట్‌ ప్రపంచంలో వెలిగిన దిగ్గజాలు ఎవరని ప్రశ్నిస్తే మనందరిలో మెదిలే బ్యాట్స్‌మెన్ ఎవరై ఉంటారు. మనకైతే ది వాల్ అని ముద్రపడిన రాహుల్ ద్రావిడ్. ఆసీస్ కయితే మైకేల్ బెవాన్. దక్షిణాప్రికాకు జాక్వస్‌ కల్లిస్‌, వెస్టిండీస్‌కి బ్రియాన్‌ లారా, శ్రీలంకకు కుమార సంగక్కరా ఉన్నారు. కానీ వీరందరికీ మించి టెక్నిక్ పరంగా తనకంటూ ఒక ఆకాశాన్నే హద్దుగా చేసుకున్న గ్రేట్ బ్యాట్స్‌మన్ మరొకరు ఉన్నారట. సాక్షాత్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చెబితే నివ్వెర పోవడం క్రికెట్ ప్రేమికుల వంతు అయింది. ఆ లెజెండ్..  ఆ మ్యాన్ ఆఫ్ టెక్నిక్ మరెవరో కాదు.. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా ప్రపంచప్రఖ్యాతి పొందిన సచిన్ టెండూల్కర్.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను తన కెరీర్‌లో చూసినా టెక్నికల్‌గా అత్యంత పటిష్టమైన ఆటగాడు మాత్రం ఒక్కడే ఉన్నాడని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ తెలిపాడు. తన హయాంలో బ్రియాన్‌ లారా, కుమార సంగక్కరా, రాహుల్‌ ద్రవిడ్‌,  అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు కాగా, ఇక్కడ భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం చాలా స్పెషల్‌ అని క్లార్‌ పేర్కొన్నాడు. ద్రవిడ్‌, సంగక్కరా, బ్రియాన్‌ లారాలు తమ ఆట తీరుతో ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసిరినప్పటికీ, సచిన్‌ మాత్రం చాలా కఠినమైన బ్యాట్స్‌మన్‌ అని క్లార్క్‌ చెప్పుకొచ్చాడు. సాంకేతికంగా తాను చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ మాత్రం సచిన్‌ ఒక్కడేనన్నాడు.

‘సచిన్‌ను ఔట్‌ చేయాలంటే అంత ఈజీగా ఉండేది కాదు. టెక్నికల్‌గా సచిన్‌ చాలా స్ట్రాంగ్‌. అతను ఏమైనా పొరపాటు చేసి వికెట్‌ సమర్పించుకోవాలి తప్పితే ఎవ్వరికీ తేలిగ్గా లొంగేవాడు కాదు. సచిన్‌ తప్పులు చేసేలా బంతులు వేసి బౌలర్లు పైచేయి సాధించేవారి తప్పితే, సాంకేతికంగా చూస్తే అతని కంటే బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ను ఇప్పటివరకూ నేను చూడలేదు. నాకు తెలిసి సచిన్‌ను టెక్నికల్‌గా గమనిస్తే బలహీనతలు ఏమీ కనబడేవికావు. నా వరకూ సచిన్‌ అందరికంటే అత్యుత్తమం’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు. 

ప్రస్తుత శకంలో మాత్రం అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అని స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్న కోహ్లి.. టెస్టు క్రికెట్‌లో కూడా తన జోరును కొనసాగిస్తుండటమే ఇందుకు ఉదాహరణగా క్లార్క్‌ తెలిపాడు. అయితే సచిన్‌, కోహ్లిల్లో సాధారణంగా కనిపించే లక్షణాల్లో భారీ సెంచరీలు చేయడాన్ని ఎక్కువగా ఆస్వాదించడమే వారిలో ప్రధానంగా కనబడే విషయమన్నాడు. 

ఆస్టేలియా తరపున 115 టెస్టులు, 245 వన్డేలు ఆడిన మైకేల్ క్లార్క్ 2015లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న ఆసీస్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

కాగా 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి అటు టెస్టుల్లో (51), ఇటు వన్డేల్లో (49) మొత్తం వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా సచిన్ చరిత్రపుటల్లో నిలిచిపోయాడు. వన్డేల్లో అతడి రికార్డును బీట్ చేయవచ్చు కానీ టెస్టు మ్యాచుల్లో మాత్రం అతడి రికార్డును సమీప భవిష్యత్తులో ఎవరూ బీట్ చేయలేరని క్రికెట్ పండితుల ఉవాచ. 200 టెస్టుల్లో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 18,426 పరుగులు సచిన్ ఖాతాలో ఉన్నాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle