newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గబ్బిలాలు, పాములు దేన్నీ వదలరా.. చైనాపై షోయబ్ అక్తర్ ధ్వజం

16-03-202016-03-2020 12:38:14 IST
2020-03-16T07:08:14.000Z16-03-2020 2020-03-16T07:08:11.966Z - - 17-04-2021

గబ్బిలాలు, పాములు దేన్నీ వదలరా.. చైనాపై షోయబ్ అక్తర్ ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మిగతా ప్రపంచానికి ఏమాత్రం మింగుడుపడని ఆహార అలవాట్లను కలిగి ఉన్నందుకే చైనా కరోనా వైరస్‌కు జన్మస్థానమై ప్రపంచం మీదికి వదలిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ చైనాపై మండిపడ్డారు. చైనాలో క్రమేణా కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పడుతూ, ప్రపంచమంతటా విస్తరిస్తున్న నేపథ్యంలో షోయబ్ ఈ మహమ్మారికి మీరే కారణం అంటూ చైనా ప్రజలను వేలెత్తి చూపారు. చైనా ప్రజల అడ్డమైన ఆహార అలవాట్లే యావత్ ప్రపంచాన్ని ప్రమాదంలోని నెట్టేశారంటూ పాక్ మాజీ స్టీడ్‌స్టర్ షోయబ్ తాజా యూట్యూబ్ చానల్‌లో ఆరోపించారు. గాలిలోని వైరస్ క్రిములు ఊపిరి తిత్తుల్లోకి చేరడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాలు నిర్ధారిస్తుండగా, మీ దరిద్రపు ఆహార అలవాట్లే కరోనా వ్యాప్తికి కారణమంటూ షోయబ్ హేతువిరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ చైనీయులపై మండిపడ్డారు. ఏది పడితే అది తిని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, ఎలుకల్ని ఎలా తింటారని విస్మయం వ్యక్తం చేశారు. వాటి రక్తం, వ్యర్థాలను సైతం ఆహారంగా తీసుకునే చైనీయులపై కోపం వస్తోందని అన్నారు. కరోనా వ్యాప్తితో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. పర్యాటకం దెబ్బతిందని, ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని  తెలిపారు. కోవిడ్‌ ప్రభావం క్రీడలపైనా పడిందని తన యూట్యూబ్‌ చానెల్‌లో చెప్పుకొచ్చారు. 

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఒక చట్టం తీసుకురావాలని షోయబ్‌ అన్నారు. చైనా పట్ల తనకేం వ్యతిరేకత లేదని, అయితే, జంతువుల పట్ల మరీ అంత క్రూరంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ‘గబ్బిలాలు, కప్పలు,పాములు, కుక్కలు వంటికి తినడం తమ సంస్కృతిలో భాగం అని చైనీయులు అనొచ్చు. కానీ, ఆ సంస్కృతి మీకు లాభాన్ని కాకుండా తీవ్రమైన నష్టాన్నే మిగిల్చింది కదా’ అని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్‌ భారత్‌కు చేరొద్దని కోరుకుంటున్నాని షోయబ్‌ తెలిపారు. భారత్‌లోని తన నా మిత్రులతో టచ్‌లో ఉన్నానని, వారంతా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఇక కోవిడ్‌ దెబ్బతో పాకిస్తాన్‌లో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) సందిగ్దంలో పడిందని, పీఎస్‌ఎల్‌ షెడ్యూల్‌ కుదించారని షోయబ్‌ తెలిపారు. కాగా, కరోనా నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ మిగతా మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించనున్నారు. సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు సైతం ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే శుక్రవారం నాటి మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. ఇక ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను రద్దు చేసిన నిర్వాహకులు.. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లను సెమీపైనల్‌కు చేరినట్టు ప్రకటించారు. మార్చి 17న సెమీఫైనల్‌, 18న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. 

ఇదిలాఉండగా.. భారత్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ రద్దు కాగా, ఆస్ట్రేలియాలో జరగుతున్న కివీస్‌, ఆసీస్‌ వన్డే సిరీస్‌ కూడా రద్దయింది. ఇక మార్చి 29న మొదలు కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కూడా ఏప్రిల్‌ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా, చైనాలోని వుహాన్‌ నగరలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్‌ 125కు పైగా దేశాలకు పాకింది. 1,45, 810 మంది ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతుండగా.. 5 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో 84 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మరణించారు.

కాగా దాదాపు రెండు నెలల తర్వాత కరోనా జన్మస్థానమైన ఊహాన్‌లో వైద్యులు తొలిసారి ముఖానికి మాస్కులు లేకుండా కనబడి చైనా ఊపిరి పీల్చుకుంటోందన్న సందేశాన్ని ఆదివారం ప్రపంచానికి తెలిపారు. కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఊహాన్‌లో చివరి కరోనా ఆసుపత్రిని కూడా మూసివేసినట్లు చైనా ప్రకటించడం విశే్షం.

 

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

CSK vs PBKS: 'కింగ్స్' వర్సెస్ 'సూపర్ కింగ్స్' .. గెలుపెవరిది?

   14 hours ago


IPL 2021: కింద మీద పడి  గెలిచిన రాజస్థాన్

IPL 2021: కింద మీద పడి గెలిచిన రాజస్థాన్

   15-04-2021


IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

IPL 2021 : చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్ మన్.. పంత్ ఒక్కడే

   15-04-2021


IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

IPL 2021: ఢిల్లీ తో రాజస్థాన్ సమరం.. ఆ జట్టుకే గెలిచే అవకాశం

   15-04-2021


విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

విరాట్ కోహ్లీ.. ర్యాంకింగ్ లో కిందకు..!

   15-04-2021


ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

ఆర్సీబీకి ఆ జంట మద్దతు.. ప్యాన్స్‌కు పండగే పండగ

   15-04-2021


కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

కోహ్లీ అంత కోపం ఎందుకయ్యా..!

   15-04-2021


మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

మళ్లీ హ్యాండ్ ఇచ్చిన సన్ రైజర్స్ మిడిలార్డర్.. గెలిచే మ్యాచ్ ఆర్సీబీ వశం..!

   15-04-2021


అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   14-04-2021


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   14-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle