newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

గంభీర్ గొప్ప మనసు.. రెండేళ్ల జీతం విరాళం

02-04-202002-04-2020 14:49:15 IST
Updated On 02-04-2020 14:55:06 ISTUpdated On 02-04-20202020-04-02T09:19:15.232Z02-04-2020 2020-04-02T09:18:56.174Z - 2020-04-02T09:25:06.124Z - 02-04-2020

గంభీర్ గొప్ప మనసు.. రెండేళ్ల జీతం విరాళం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా విపత్తు అందరినీ కదిలిస్తోంది. భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తన ఉదారతను చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయం చేయడానికి భారీ విరాళం ప్రకటించారు. కరోనాపై భారత్‌ చేస్తున్న పోరాటానికి దాతలు చేయూతనివ్వాలని శనివారం ప్రధాని నరేంద్రమోదీ కోరిన విషయం తెలిసిందే. ఇందుకు కొత్తగా పీఎం కేర్స్‌ ఫండ్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా తనకు వచ్చే రెండేళ్ల వేతనాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చాడు. 

ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘దేశం తమ కోసం ఏం చేసిందని ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ దేశం కోసం మనం ఏం చేశామన్నది అసలు ప్రశ్న. నేను నా రెండేళ్ల జీతాన్ని పీఎం కేర్స్‌ ఫండ్‌కు అందిస్తున్నాను. మీరు కూడా తోచినంత సహాయం చేయండి’అంటూ గౌతమ్‌ గంభీర్‌ ట్వీట్‌ చేశారు. క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు పీఎం కేర్ ఫండ్స్ కు విరాళాలిస్తున్నారు. కరోనా మహమ్మారీని ఎదుర్కొనేందుకు గౌతమ్‌ గంభీర్‌ చేసిన రెండో సహాయం ఇది. ఇప్పటికే సోమవారం లోక్‌సభలో ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు కావాల్సిన పరికరాల కోసం తన ఎంపీ నిధుల నుంచి రూ .50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.  

ఈసాయానికి ఇది అదనం. గంభీర్ ని ఈ సందర్భంగా తోటి క్రికెటర్లు అభినందిస్తున్నారు. విరాళం ఎంత అనేది కాదు.. మనం ఏం చేస్తున్నామన్నది ముఖ్యం అంటున్నారంతా. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ధోనీ, అనుష్క-విరాట్ జంట 3 కోట్లు విరాళం ఇచ్చారు.  కోవిడ్‌-19 బాధితులను, పేదలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.80 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు.

పీఎం కేర్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.25 లక్షలు, ఫ్రీ ఇండియా స్వచ్ఛంద సంస్థకు, వెల్ఫేర్‌ ఆఫ్‌ స్ట్రే డాగ్స్‌కు రూ. 5 లక్షల చొప్పున రోహిత్‌ సాయం చేశాడు.హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ రూ. 5 లక్షలు పీఎం–కేర్స్‌ ఫండ్‌కు... రూ. 5 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు. మరో మహిళా క్రికెటర్‌ పూనమ్‌ యాదవ్‌ రూ. 2 లక్షలు, భారత్ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సత్యన్‌ రూ. లక్షా 25 వేలు విరాళంగా ప్రకటించాడు. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్, రాజ్యసభ ఎంపీ హోదాలో తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది.  కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌ 18 ఏళ్ల టీనేజ్‌ షూటర్‌ మను భాకర్‌ లక్ష,  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రూ.50 లక్ష విరాళం ప్రకటించారు.

 

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి పరాజయం

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్ లో భవానీ దేవి పరాజయం

   14 hours ago


టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ 3 వ రౌండ్ కి చేరుకున్నాడు

టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ 3 వ రౌండ్ కి చేరుకున్నాడు

   19 hours ago


నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా

నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా

   25-07-2021


టోక్యో ఒలింపిక్స్ 2020: సుమిత్ నాగల్ 25 సంవత్సరాల తరువాత ఈ రికార్డుతో చరిత్ర సృష్టించాడు

టోక్యో ఒలింపిక్స్ 2020: సుమిత్ నాగల్ 25 సంవత్సరాల తరువాత ఈ రికార్డుతో చరిత్ర సృష్టించాడు

   24-07-2021


టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్ తరపున తొలి పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను భారత్ తరపున తొలి పతకం

   24-07-2021


4 సంవత్సరాల తర్వాత భారత్ పై శ్రీలంక వన్డే మ్యాచ్ గెలిచింది

4 సంవత్సరాల తర్వాత భారత్ పై శ్రీలంక వన్డే మ్యాచ్ గెలిచింది

   24-07-2021


అందరూ చీర్స్‌ ఫర్‌ ఇండియా చేద్దాం రండి

అందరూ చీర్స్‌ ఫర్‌ ఇండియా చేద్దాం రండి

   23-07-2021


నారప్పకి బాగానే గిట్టుబాటు అయ్యిందంట,,

నారప్పకి బాగానే గిట్టుబాటు అయ్యిందంట,,

   23-07-2021


IND vs SL: భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు

IND vs SL: భారత్ 30 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు

   23-07-2021


చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?

చెన్నై లో బ్రాహ్మిణ్‌ లు మాత్రమే ఉంటారా..?

   23-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle