newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గంభీర్‌తో అలా గొడవ పడటం తప్పే.. పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్

01-05-202001-05-2020 11:04:57 IST
Updated On 01-05-2020 11:10:44 ISTUpdated On 01-05-20202020-05-01T05:34:57.273Z01-05-2020 2020-05-01T05:34:55.214Z - 2020-05-01T05:40:44.973Z - 01-05-2020

గంభీర్‌తో అలా గొడవ పడటం తప్పే.. పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెటర్లతో మైదానంలో గొడవపడటంపై పాక్ వెటరన్ క్రికెటర్లు పశ్చాత్తాపం చెబుతున్న వార్తలు ఎక్కడ చూస్తున్నా వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఘటనలో కమ్రాన్ అక్మల్ ముందుకొచ్చాడు. పదేళ్ల క్రితం టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌తో జరిగిన వాగ్వాదంపై పాకిస్తాన్‌ వెటరన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ పెదవి విప్పాడు. ఆనాటి గొడవపై మాట్లాడుతూ.. అది కావాలని జరిగింది కాదని, ఆ సమయంలో అపార్థం చోటు చేసుకోవడంతోనే అలా జరిగిందన్నాడు. 

2010లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్‌లో గౌతం గంభీర్‌-కమ్రాన్‌ అక్మల్‌ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ కొట్టుకునేలా తమ నోటికి పని చెప్పడంతో అంపైర్లు చొరవతో దానికి ముగింపు పలికారు. గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. కమ్రాన్ అక్మల్  పదే పదే కీపర్ క్యాచ్‌ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన గంభీర్ అతనికి చిన్నపాటి వార్నింగ్ ఇవ్వగా.. కమ్రాన్ అక్మల్ కూడా అదే తరహాలో బదులివ్వడంతో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఓవర్‌లో వచ్చిన బ్రేక్‌తో ఇద్దరూ మరోసారి మాటలు తూటాలు పేల్చుకున్నారు.  ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేలా కనిపించారు. అయితే మధ్యలో అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పగా.. అప్పుడు అక్కడే ఉన్న ఎంఎస్‌ ధోని.. గంభీర్‌ని శాంతపరిచాడు. ఆపై 2012-13 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్‌ శర్మపై అక్మల్‌ నోరు పారేసుకున్నాడు.

ఈ రెండు ఘటనలు అనుకోకుండా జరిగినవేనని కమ్రాన్‌ అక్మల్‌ తెలిపాడు. ‘నేను-గంభీర్‌ మంచి ఫ్రెండ్స్‌. మేమిద్దరం లిస్ట్‌-ఎ క్రికెట్‌ ఆడే క్రమంలో స్నేహితులుగా ఉండేవాళ్లుం. ఆనాడు గంభీర్‌తో గొడవ ఎందుకు వచ్చిందో కూడా సరిగా తెలియదు. కావాలని గంభీర్‌తో గొడవ పడలేదు. ఇషాంత్‌ శర్మతో గొడవ ఘటన కూడా అంతే. నాకు ఇషాంత్‌ కూడా స్నేహితుడే. నేను ఫీల్డ్‌లో ఎక్కువగా మాట్లాడను. అవి చాలా చిల్లర ఘటనలు. మేము ఒకరినొకరు గౌరవించుకుంటాం. ఫీల్డ్‌లో జరిగింది అక్కడికే పరిమితం’ అని కమ్రాన్‌ తెలిపాడు. 

పాకిస్తాన్‌ తరఫున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20లను కమ్రాన్‌ ఆడాడు. 2017లో పాకిస్తాన్‌ తరఫున చివరిసారి కనిపించాడు కమ్రాన్‌. ఆ తర్వాత పేలవమైన ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. ఆ స్థానాన్ని సర్ఫరాజ్‌ అహ్మద్‌ భర్తీ చేయడంతో కమ్రాన్‌కు చోటు లేకుండా పోయింది. ఒకానొక సమయంలో కమ్రాన్‌పై సర్ఫరాజ్‌ బహిరంగ విమర్శలు కూడా చేశాడు. కమ్రాన్‌ జట్టులో చోటు కోల్పోవడానికి సర్ఫరాజ్‌ లాబీయింగ్‌ చేశాడనేది అప్పట్లో బాగా వినిపించింది. 

సచిన్, ధోని, కోహ్లిలను చూసి బుద్ధి తెచ్చుకో.. తమ్ముడికి అక్మల్ హితబోధ

భారత క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోనిలను చూసి తన తమ్ముడు ఉమర్‌ అక్మల్‌ బుద్ధి తెచ్చుకోవాలని పాకిస్తాన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ అన్నాడు. వారిని చూసైనా మైదానంలోనూ, బయట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలంటూ ఉమర్‌ అక్మల్‌కు సూచించాడు. ఉమర్‌పై తాజాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) సందర్భంగా బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని రహస్యంగా ఉంచినందుకుగానూ పీసీబీ ఈ శిక్ష విధించింది. నిషేధ కాలంలో ఏ స్థాయి క్రికెట్‌ ఆడకూడదంటూ హెచ్చరించింది. 

ఈ సందర్భంగా కమ్రాన్‌ అక్మల్‌ మాట్లాడుతూ ‘ఉమర్‌ ఇంకా యువకుడు. అతను తప్పు చేసి ఉంటే ఇతరులను చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో విరాట్, సచిన్, ధోని జీవితాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వివాదాలకు దూరంగా సచిన్‌ నీతిగా క్రికెట్‌ ఆడాడు. విరాట్, ధోని, బాబర్‌ ఆజమ్‌ల నుంచి ఉమర్‌ ఇంకా చాలా నేర్చుకోవాలి’ అని కమ్రాన్‌ అన్నాడు.

 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle